Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌కి షాక్ ఇచ్చిన బన్నీ.. అసలు ఏం జరిగింది..?

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (16:27 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. కాంబినేషన్‌లో రూపొందుతోన్నతాజా చిత్రం అల... వైకుంఠపురములో. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు ఘన విజయాలు సాధించడంతో తాజా చిత్రం అల.. వైకుంఠపురములో పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 
 
ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, హారిక మరియు హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్‌గా ప్రకటించారు చిత్ర నిర్మాతలు.
 
అయితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు-సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా కూడా సంక్రాంతికే వస్తుండడంతో అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ చిత్ర నిర్మాతలు కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాని జనవరి 12నే రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు.
 
ఇలా.. బన్నీ అల.. వైకుంఠపురములో, మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయనున్నట్టు స్వయంగా ఆ చిత్ర నిర్మాతలే ఎనౌన్స్ చేయడంతో టాలీవుడ్‌లో ఉత్కంఠ నెలకొంది.
 
 
 
ఆ తర్వాత సినీ పెద్దలు ఒకే రోజు రెండు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేస్తే ఇండస్ట్రీకి మంచిది కాదు. అలాగే రెండు చిత్రాల నిర్మాతలు ఆ విధంగా ఒకే రోజు రిలీజ్ చేస్తే నష్టపోయే అవకాశం ఉందని నచ్చ చెప్పడంతో జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, జనవరి 12న అల.. వైకుంఠపురములో చిత్రాలు రిలీజ్ చేసేందుకు ఒప్పించారు. 
 
ఇప్పుడు బన్నీ ఆలోచనలో పడ్డాడట. ఎందుకంటే... రికార్డు కలెక్షన్స్ రావాలంటే.. ముందుగా రిలీజ్ చేయాలని అందుచేత మహేష్ సినిమా కంటే ముందుగా అనగా జనవరి 10న అల.. వైకుంఠపురములో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట.
 
బన్నీ ఇలా ఆలోచిస్తున్నాడని తెలిసి మహేష్ అండ్ టీమ్ షాక్ అయ్యారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments