Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ సర్ ప్రైజ్.. పుష్ప-2 డైలాగ్ చెప్పేశాడుగా!

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (15:27 IST)
పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ సినీ ప్రియులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా సీక్వెల్‌గా వస్తున్న పుష్ప-2లో అల్లు అర్జున్ ఎలాంటి పంచ్ డైలాగ్ చెప్పబోతున్నాడో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ చిత్రం ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. దీంతో ఈ చిత్ర నిర్మాతలు హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బేబీ మూవీని అభినందిస్తూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చివర్లో అభిమానులు పుష్ప-2 డైలాగ్ అడగడంతో పంచ్ డైలాగ్ చెప్పాడు. 
 
"ఇదంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుంది, పుష్ప గాడి రూల్" (ఏం జరిగినా అది పుష్ప రూల్ ప్రకారమే జరుగుతుంది అని అర్థం వచ్చేలా డైలాగ్)" అని అల్లు అర్జున్ అన్నారు. ఈ డైలాగ్ ప్రస్తుతం అభిమానుల్లో సంచలనం రేపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments