ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం "పుష్పక విమానం" ట్రైలర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 30న "పుష్పక విమానం" సినిమా ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరవుతున్నారు అల్లు అర్జున్. బన్నీ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అవడం "పుష్పక విమానం" యూనిట్ మొత్తానికి సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ అంతా కలిసి థాంక్యూ బన్నీ అన్నా అంటూ సెలబ్రేట్ చేసుకున్నారు.
"పుష్పక విమానం" సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేష్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్, ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థలు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.
"పుష్పక విమానం" చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని 'కింగ్ అఫ్ ది హిల్' ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు