Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ అర్హ అల్లరి - వైరల్ అవుతున్న వీడియో

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (18:08 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏమాత్రం టైమ్ దొరికినా... ఫ్యామిలీ మెంబర్స్‌తో స్పెండ్ చేయడానికే ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా బన్నీ ముద్దుల కూతురు అర్హతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఇంట్లో అర్హ చేసే అల్లరి అంతాఇంతా కాదు. ఇక బన్నీ ఇంట్లో ఉంటే.. అల్లరే అల్లరి. అల.. వైకుంఠపురములో సినిమాలోని రాములో రాముల సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో.. ఆ సాంగ్ యూట్యూబ్‌లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. 
 
ఈ పాట పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తెగ నచ్చేసింది. ఈ సినిమాలో రాములో రాముల పాటను బన్నీ కూతురు దోశ స్టెప్పుతో పోల్చడం... తెలిసిందే. అర్హ అలా... దోశ స్టెప్పు గురించి చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా అర్హతో సరదాగా గడిపిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అందులో అర్హను నీ ఫేవరేట్ కలర్ ఏంటి బే అని అడగగా.. దానికి అర్హ పింక్ బే అని సమాధానం చెప్పింది. 
 
వెంటనే బన్నీ.. నన్ను బే అంటావా అని ప్రశ్నించగా.. మరింత అల్లరిగా అవును బే అంటూ సమాధానం ఇచ్చింది అర్హ. దీనికి బన్నీ టు టైమ్స్ బే అంటావా బే అనగా.. అవును అనే సమాధానం చెప్పింది. కన్న తండ్రిని నన్ను బే అంటావా బే అనగా మళ్లీ మరింత అల్లరిగా ముద్దుగా అవును అని సమాధానం చెప్పింది. నీకు అసలు భయం ఉందా బే అని బన్నీ అడుగగా అర్హ లేదు బే అనడంతో మళ్లీ బే అంటావా అంటూ ప్రేమతో హగ్ చేసుకున్నారు బన్నీ. 
 
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటి నుంచే వైరల్ అయ్యింది. దీనికి ఫాదర్‌ డాటర్‌ లవ్‌, జస్ట్‌ ఫర్‌ ఫన్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌లను బన్నీ జత చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే... అల.. వైకుంఠపురములో సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ.. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ని త్వరలోనే కేరళలో ప్రారంభించనుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

She’s my Bae ( Bey ) #fatherdaughterlove #justforfunn #alluarha

A post shared by Allu Arjun (@alluarjunonline) on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments