Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్‌ని టార్గెట్ చేసిన బ‌న్నీ.. మ‌ళ్లీ మొద‌లైన వివాదం..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మ‌ధ్య గ‌తంలో వివాదం రావ‌డం... ఆ త‌ర్వాత బ‌న్నీ క్లారిషికేష‌న్‌తో కూల్ అవ్వ‌డం తెలిసిందే. ఇప్పుడు మ‌ళ్లీ వీరిమధ్య వివాదం మొద‌లైంది

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (11:51 IST)
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మ‌ధ్య గ‌తంలో వివాదం రావ‌డం... ఆ త‌ర్వాత బ‌న్నీ క్లారిషికేష‌న్‌తో కూల్ అవ్వ‌డం తెలిసిందే. ఇప్పుడు మ‌ళ్లీ వీరిమధ్య వివాదం మొద‌లైంది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే... అల్లు అర్జున్ న‌టిస్తోన్న తాజా చిత్రం "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా". ఈ సినిమాకి వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మే 4వ తేదీన ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. అయితే... అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టీజ‌ర్ రిలీజ్ చేశారు. 
 
ఈ డైలాగ్ ఇంపాక్ట్ పేరుతో రిలీజ్ చేసిన ఈ టీజ‌రే వివాద‌స్పం అవుతోంది. ఈ టీజ‌ర్‌లో అల్లు అర్జున్ సౌతిండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ , వెస్ట్ అన్ని ఇండియాలు లేవురా మ‌న‌కి ఒక్క‌టే ఇండియా అనే డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ ప‌వ‌న్‌ని టార్గెట్ చేస్తూ పెట్టారంటూ ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే.. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా సార్లు సౌతిండియా అంటే నార్త్ ఇండియా వారికి చిన్న‌చూపు అంటూ త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
 
ఇప్పుడు నా పేరు సూర్య‌లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ప‌వ‌‌న్‌ని ఉద్దేశించి పెట్టిందే అనే వాద‌న వినిపిస్తోంది. దీంతో సోష‌ల్ మీడియాలో మ‌ళ్లీ బ‌న్నీ ఫ్యాన్స్‌కి ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి మ‌ధ్య వార్ స్టార్ట్ అయ్యింది. మ‌రి... ఈ వివాదం సోష‌ల్ మీడియాతోనే ఆగుతుందా..? లేదో చూడాలి.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments