Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివరాత్రి స్పెషల్ ఫర్ మెగా ఫ్యాన్స్.. విన్నర్‌గా తేజ్.. అదే రోజున బన్నీ డీజే ట్రైలర్ రిలీజ్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా దువ్వాడ జగన్నాథం సినిమా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. విన్నర్ అంటూ సాయిధరమ్ తేజ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అదే రోజున ఉద

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (17:37 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా దువ్వాడ జగన్నాథం సినిమా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. విన్నర్ అంటూ సాయిధరమ్ తేజ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అదే రోజున ఉదయం 9 గంటలకు దువ్వాడ జగన్నాథం టీజర్ రిలీజ్ అవుతుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. బన్నీ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది.
 
ఇప్పటికే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీతో మెగా ఫ్యాన్స్ మంచి జోష్ మీదున్నారు. ఆ ఊపు తగ్గేలోపే విన్నర్‌గా తేజ్ వస్తున్నాడు. గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. అనసూయ స్పెషల్ సాంగ్ తో వస్తున్న ఈ విన్నర్ సుప్రీం హీరో సాయి ధరం తేజ్‌కు మరో హిట్ ఇస్తుందని ఆశిస్తున్నారు.
 
మరోవైపు డీజేగా బన్నీ కూడా టీజర్‌ను అదే రోజున రిలీజ్ చేస్తున్నాడు. ఈ పోస్టర్లో బ్రాహ్మణ వేషంలో బన్నీ వారెవా అనిపించుకుంటున్నాడు. ఇక డీజేను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
కాగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన దువ్వాడ జగన్నాథం.. పెళ్ళిళ్లకు కావలసిన వస్తువులను చేరవేసే వ్యాపారం చేస్తాడు. అయితే పూజ హెగ్డేను చూసి ప్రేమలో పడిపోతాడు. ఆర్థోడెస్క్ ఫ్యామిలీకి చెందిన పూజా హెగ్డే ప్రేమను పొందేందుకు దువ్వాడ జగన్నాథం.. డిస్క్ జాకీగా ఎలా మారాడు అనేదే కథ. ఈ సినిమాలో బన్నీ లుక్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments