Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ల పుష్ప- 2 ది రూల్‌ ఫస్టాఫ్‌ లాక్‌

డీవీ
మంగళవారం, 8 అక్టోబరు 2024 (17:18 IST)
The Rule First Off Lock poster
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్ చిత్రం పుష్ప-2 దిరూల్‌. పుష్ప దిరైజ్‌ సాధించిన బ్లాకబస్టర్ విజయమే అందుకు కారణం. ఆ చిత్రంలోని ప్రతి అంశం సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పుష్ప-2 గురించి ప్రతి అంశం సన్సేషనే. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా  బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్‌ ఇండియా చిత్రంగా  ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌  అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. 
 
డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ చిత్రం ఫస్ట్‌హాఫ్‌ లాక్‌ చేశారు.. ఈ ఫస్ట్‌హాఫ్‌ అద్బుతంగా వుందని, ప్రేక్షకులు ఎంత ఊహించుకున్నా అంతకు తగ్గేదేలే లా వుందని అంటున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాలెన్స్‌ షూటింగ్‌ను జరుపుకుంటునే మరోవైపు నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. 
 
ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్‌, రెండు పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్‌ ఇండియా స్థాయిలో డిసెంబరు 6న పుష్ప-2 క్రియేట్‌ చేయబోయే రిక్డార్డుల గురించి అందరి రెడీ కావాల్సిందే. అంతేకాదు ఈ చిత్రం రిలీజ్‌క ముందే 1000 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ పూర్తిచేసిందని అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు : కొత్త ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా

బతుకమ్మ సంబరాల్లో సౌండ్ సిస్టమ్.. ఆపమన్నందుకు జవాన్‌పై కత్తితో దాడి

అక్టోబర్ 17న ఈశాన్య రుతుపవనాలు.. ఏపీకి భారీ వర్ష సూచన

భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారం

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు : హమ్మయ్య.. ఎట్టకేలకు వినేశ్ ఫొగాట్ గెలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు తేనెలో ఇవి కలిపి తీసుకుంటే...

రాత్రి భోజనం ఆరోగ్యకరంగా వుండాలంటే?

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

తర్వాతి కథనం
Show comments