Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bigg Boss 8: బిగ్ బాస్-8 గ్రాండ్ ఫినాలేకు రానున్న పుష్పరాజ్.. నిజమేనా?

సెల్వి
గురువారం, 12 డిశెంబరు 2024 (16:51 IST)
తెలుగు ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటికే ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కూడా ఈ ఆదివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోకి ఫైనలిస్ట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ ఫైనల్ విజేతకు కప్ ఇవ్వడానికి ముఖ్య అతిథిగా ఎవరు వస్తారనే విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చనీయాంశమైంది. 
 
ఈ కారణంగానే బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా పుష్పరాజ్ వస్తాడని, ట్రోఫీని బన్నీ స్వయంగా విన్నర్‌కు అందజేస్తాడని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇందులో ఎంతవరకు నిజమో, ఎంత అబద్ధమో తెలుసుకుందాం.. బిగ్ బాస్‌లో నిఖిల్, ప్రేరణ, నబిల్, గౌతమ్, అవినాష్ ఫైనల్ అయ్యారు. 
 
ఇందులో ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్. నిఖిల్ రెండవ ఫైనలిస్ట్, గౌతమ్ మూడవ ఫైనలిస్ట్, ప్రేరణ, నబీల్ నాలుగు, ఐదో ఫైనలిస్టులుగా ఉన్నారు. విన్నర్ ఓటింగ్‌లో గౌతమ్, నిఖిల్ మొదటి రెండు స్థానాల్లో నిలవగా, ఇద్దరి ఓటింగ్ శాతంలో ఎలాంటి మార్పు లేదు. కానీ ఓట్లలో మాత్రం స్వల్ప తేడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చివరి వరకు ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. 
 
ఈ తరుణంలో బిగ్ బాస్ ఫైనల్ విన్నర్‌కి ట్రోఫీని అందించడానికి అల్లు అర్జున్ వస్తాడని తెలుస్తోంది. అయితే ఇటీవలే పుష్ప-2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ మంచి క్రేజ్ మీద ఉన్నాడు. ఇప్పుడు అతడిని ఫైనల్‌కి తీసుకురావడం వల్ల షో మరింత ఆసక్తికరంగా సాగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ గెలుచుకున్న గుకేశ్ దొమ్మరాజు

వార్తాపత్రికల్లో చుట్టబడిన వేడి వేడి సమోసాలు, జిలేబీలు లాగిస్తున్నారా?

ప్రతి కార్యకర్తకి FB, YouTube, Twitter అన్న జగనన్న: అందుకే అవంతికి ఆగ్రహం, వైసిపి కుండకు చిల్లు

తిరుమలలో కుంభవృష్టి.. ఏరులై పారుతున్న వర్షపునీరు (Video)

ఏపీలో టెన్త్ - ఇంటర్ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

High blood pressure అధిక రక్తపోటు వున్నవారు ఏం తినకూడదు?

Fruits burn Belly fat, బెల్లీ ఫ్యాట్ కరిగించే పండ్లు, ఏంటవి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట తాగకల 5 పానీయాలు

తర్వాతి కథనం
Show comments