Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాకుంతలంలో అల్లు అర్హ.. భరతుడి పాత్రలో..

Webdunia
గురువారం, 15 జులై 2021 (15:00 IST)
Allu Arha
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ ఇటీవల శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రాన్ని రూపోందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. సమంత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ కీలకపాత్రలో నటించనుందని ప్రకటించింది చిత్రబృందం. అల్లు అర్హ ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందట. 
 
దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇక ఈ మేరకు అర్హ సెట్స్‌లో చేరనుంది. ఆమె 10 రోజుల పాటు శాకుంతలం షూటింగ్‌లో పాల్గొంటుందట. ఈ సినిమా మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల అద్భుతమైన, అందమైన ప్రేమ కథ ఆధారంగా రూపోందుతుంది. 
 
ఇందులో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నారు. కేరళలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు దేవ్ మోహన్. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిచనున్నారు.
 
గుణ శేఖర్ శాకుంతలం కంటే ముందు హిరణ్య కశిప అనే ఓ భారీ సినిమాను ప్రకటించారు. ఆయన ఎప్పటినుండో ఈ సినిమాను తెరకెక్కించాలనీ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా రానా ప్రధాన పాత్రలో ఈ సినిమాను ప్రకటించారు కూడా. 
 
పురాణాలలో శివ భక్తుడు ప్రహ్లాద, రాక్షస రాజు హిరణ్యకశిపుడు మధ్య జరిగే సన్నివేశాలతో గుణ శేఖర్ ఈ కథను అల్లుకున్నారు గుణశేఖర్. ఐతే ప్రాజెక్ట్ ప్రకటించి చాలాకాలం అవుతున్నా.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో గుణ శేఖర్ సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే సినిమాను మొదలు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఐకు బెదిరింపులు - మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు

హెచ్ఎంపీవి వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది.. లక్షణాలు.. చికిత్స... జాగ్రత్తలు ఏంటి?

పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు.. మాస్కులు ధరించాలా? వద్దా? కర్నాటక అడ్వైజరీ

టీచర్‌కు నోటు పుస్తకం చూపిస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన బాలిక...

ప్రేమించుకున్నారు.. కానీ పెద్దలకు భయపడి కారులో ప్రేమ జంట ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments