Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనంద్ దేవరకొండ లాంచ్ చేసిన బాపు నుంచి అల్లో నేరేడల్లో పిల్లా సాంగ్

డీవీ
శుక్రవారం, 10 జనవరి 2025 (13:19 IST)
Song Launched by Anand Deverakonda
ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్న డార్క్ కామెడీ-డ్రామా 'బాపు'. ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహిస్తున్నారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రాజు, సిహెచ్‌ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా మేకర్స్ బాపు మ్యూజికల్ జర్నీ కిక్ స్టార్ట్ చేశారు. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ 'అల్లో నేరేడల్లో పిల్లా' సాంగ్ ని లాంచ్ చేశారు.
 
ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. 'అల్లో నేరేడల్లో పిల్లా' సాంగ్ కంపోజిషన్ బ్యూటీఫుల్ అండ్ క్యాచి గా వుంది. రామన్న వాయిస్ ఈ సాంగ్ కి పర్ఫెక్ట్. లిరిక్స్ బ్యూటీఫుల్ గా వున్నాయి. మణి లుక్ చాలా బావుంది. ఈ సినిమా మరో బలగం కావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' అన్నారు
 
మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్ ఈ పాటని సోల్ ఫుల్ లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. సెన్సేషనల్ సింగర్ రామ్ మిర్యాల తన ఎనర్జిటిక్ వోకల్స్ తో కట్టిపడేశారు. రఘు రాం రాసిన లిరిక్స్ క్యాచి గా వున్నాయి. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.
 
బాపు నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఓ వ్యవసాయ కుటుంబం ఎమోషనల్ జర్నీగా వుంటుంది. ఓ కుటుంబ సభ్యుడు ఇతరుల మనుగడ కోసం తమ జీవితాన్ని త్యాగం చేయవలసి వచ్చినప్పుడు ఫ్యామిలీ డైనమిక్స్ ఎలా మారుతుందో డార్క్ కామెడీ, హ్యుమర్, ఎమోషనల్ గా హత్తుకునే నెరేటివ్ తో సినిమా ఉండబోతోంది.  
 
ఈ చిత్రానికి వాసు పెండెం డీవోపీగా పని చేస్తున్నారు. RR ధృవన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అనిల్ ఆలయం ఎడిటర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments