Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపి ఫైబర్‌నెట్‌ రవివర్మపై నాపై వచ్చిన ఆరోపణలపై కేసు పెడతా : రామ్ గోపాల్ వర్మ

డీవీ
శనివారం, 7 డిశెంబరు 2024 (15:58 IST)
Ram Gopal Varma
రామ్ గోపాల్ వర్మ ఏదోరకంగా వివాదంలో వుంటూ సోషల్ మీడియాలోనూ బయటా పెద్ద ప్రచారసాధనంగామారిపోయారు. గతంలో వ్యూహం అనే సినిమా తీశాడు. ఆ సినిమా నిర్మాతపైనా ఆరోఫలున్నాయి. దీనిపై శనివారంనాడు ఓ వివరణ ఇచ్చాడు. ‘వ్యూహం’ సినిమా  దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మాత కాగా  శ్రీకాంత్‌ ఫైనాన్స్‌ను అందించారు. 
 
ఇక నా పార్టనర్‌ రవివర్మ సొంతంగా ఫైనాన్షియర్‌ శ్రీకాంత్‌ నుండి ఏపి ఫైబర్‌ నెట్‌ ప్రసారహక్కులను కొనుగోలు చేశారు. ఏపి ఫైబర్‌నెట్‌ రవివర్మనుండి  ప్రసార హక్కులను రెండుకోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది. కానీ కోటి రూపాయలు మాత్రమే ఎకౌంట్‌కు వచ్చింది. ఇది శ్రీకాంత్, రవివర్మలకు సంబంధించిన ఒప్పందం. 
 
ఈ హక్కులు ఏపి ఫైబర్‌నెట్‌కు 60 రోజులపాటు ఇవ్వబడ్డాయి. ఏపి ఫైబర్‌నెట్‌ వారు చెప్పిన ప్రకారం లక్షా యాభైవేల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఆ సమయంలో టిడిపిపార్టీ ఎలక్షన్‌ కమీషన్‌కి కంప్లైంట్‌ ఇవ్వటంతో ప్రసారాలను నిలిపివేశారు. రవివర్మకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్‌ ఎమౌంట్‌ను ఏపి ఫైబర్‌నెట్‌ నిలిపివేసింది. 
 
తన బకాయి మొత్తం చెల్లించనందున నా పార్టనర్‌ రవివర్మ సివిల్‌ కోర్టులో కేసు పెట్టారు. అలాగే రవివర్మ పైన, నా పైన తప్పుగా ప్రచారం చేసి మా పరువుకు భంగం కలిగించిన కొన్ని టీవి ఛానల్స్‌ టీవి5, ఏబిఎన్, మహా టీవి మరియు కొన్ని ఛానల్స్‌పై నష్ట పరిహారం కోసం కేసులు పెడుతున్నాం అని వర్మ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rajinikanth: సినిమాల్లో సూప‌ర్‌స్టారే... రాజ‌కీయాల్లో మాత్రం పేలని తుపాకీ

Porcupine : పులికి చుక్కలు చూపించిన ముళ్ల పందులు.. బిడ్డల్ని ఎత్తుకెళ్తావా? (video)

ముందు అవంతి శ్రీనివాస్.. ఆ తర్వాత గ్రంధి శ్రీనివాస్.. వైకాపా షాక్

కూతురు పట్ల అలా ప్రవర్తిస్తావా? కువైట్ నుంచి వచ్చి బంధువును చంపేసిన తండ్రి.. (video)

పవన్ కళ్యాణ్ టూర్ ఎఫెక్ట్ - మాజీ సీఎం జగన్‌కు సర్కారు షాక్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

High blood pressure అధిక రక్తపోటు వున్నవారు ఏం తినకూడదు?

Fruits burn Belly fat, బెల్లీ ఫ్యాట్ కరిగించే పండ్లు, ఏంటవి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట తాగకల 5 పానీయాలు

Vitamin C Benefits: విటమిన్ సి వల్ల శరీరానికి 7 ఉపయోగాలు

winter health కండరాలు నొప్పులు, పట్టేయడం ఎందుకు?

తర్వాతి కథనం
Show comments