Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిపిరికి అల్లంత దూరంలో టీజర్ వుంది

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (16:43 IST)
Ravan Nittoor, Sri Nikita
కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 
 
రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ విడుదలైయింది. నిమిషం 30 సెకన్లు నిడివి గల టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. టీజర్ లో కథా నేపధ్యాన్ని చాలా ఆసక్తికరంగా రివిల్ చేశాడు దర్శకుడు. తిరుపతిలో ఫోటోల షాపు పెట్టుకోవాలని తపించే హీరో, అతనికి ఒక అందమైన ప్రేమ కథ, సరదగా సాగిపోతున్న అతని జీవితాన్ని ఒక మనీ బాగ్ ఊహించని మలుపు తిప్పుతుంది. ఈ క్రమంలో వచ్చిన సంఘటనలు కథపై చాలా క్యూరీయాసిటీని పెంచాయి. 
 
రావణ్ అద్భుతమైన నటన కనబరిచారు. టీజర్ లో కనిపించిన మిగతా నటీనటులంతా చక్కని అభినయం కనబరిచారు. టీజర్ ఫణి కళ్యాణ్ అందించిన నేపధ్య సంగీతం బ్రిలియంట్ గా వుంది. డిజికె కెమరాపనితనం డీసెంట్ గా వుంది. 
 
తిరుపతి నేపధ్యంలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు వున్నాయి. ఇప్పటికే విడుదలై “మా తిరుపతి” పాటకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మా తిరుపతి పాట రిలీజ్ అయిన రోజు నుండి వరుసగా 12 రోజులు టాప్ ట్రెండింగ్ లో ఉంటూ 30 లక్షలు పైన వ్యూస్ ని సాధించి చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. 
 
నూతన దర్శకుడు ఆనంద్ తన తొలి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ చూపించబోతున్నారని ప్రమోషనల్ మేటీరియల్ చూస్తే అర్ధమౌతుంది. ఇప్పటికే మా తిరుపతి పాటతో అందరినీ ఆకర్షించిన ఈ చిత్రం ఇప్పుడు ఇంట్రస్టింగ్ టీజర్ తో మరిన్ని అంచనాలని పెంచింది. 
 
నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
నటీనటులు:  రావణ్ నిట్టూరు,  శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ, సంగీతం : ఫణి కళ్యాణ్, ఎడిటర్ : సత్య గిడుతూరి 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments