Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు జక్కన్న వలలో చిక్కిన బాలీవుడ్ నటి!

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (21:30 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్మిస్తున్న తాజా చిత్రం "ఆర్ఆర్ఆర్" (రణం, రౌద్రం, రుధిరం). ఈ చిత్రం కరోనా లాక్డౌన్ తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్‌లు హీరోలుగా నటిస్తుంటే, ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. 
 
అయితే, ఈ చిత్రంలోని హీరోయిన్లలో ఒకరైన అలియా భట్ ఎట్టకేలకు రాజమౌళి చేతికి చిక్కింది. కరోనా లాక్డౌన్ కారణంగా ముందుస్తు ప్రణాళికలు అన్ని తారుమారైపోయాయి. దీంతో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు డేట్స్‌ను కేటాయించలేని పరిస్థితి అలియా భట్‌కు ఏర్పడింది. అలియా హిందీ సినిమాలు చేస్తుండటంతో షూట్‌లో పాల్గొన‌డం ఆల‌స్య‌మైంది. దీనికితోడు కరోనా వైరస్ దెబ్బకు మరింత జాప్యం అయింది. 
 
ఈ భామ‌ ఎప్పుడు షూట్‌లో జాయిన్ అవుతుంద‌నే దానిపై ఇప్ప‌టికే చాలా వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. తాజా స‌మాచారం ప్రకారం న‌వంబ‌ర్ 2న అలియాభ‌ట్ "ఆర్ఆర్ఆర్" టీంతో క‌లిసి షూటింగులో జాయిన్ కానుంద‌ట‌. రాజ‌మౌళి నెక్ట్స్ షెడ్యూల్‌లో అలియాపై వ‌చ్చే కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నాడ‌ట‌. కాగా, ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్న రాంచరణ్‌కు భార్యగా అలియా భట్ నటించనుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments