Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‍‌ను సర్‌ప్రైజ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ!

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (13:12 IST)
'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో సీతగా నటించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఆలరించారు. ఈ చిత్రంతో తెలుగు వారికి కూడా ఎంతో చేరువైంది. తాజాగా ఈ అమ్మడు ఆ చిత్రంలోని ఓ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్‌‌ ఇంటికి ఓ గిఫ్ట్‌ పంపి తారక్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది. ఎన్టీఆర్‌ పిల్లల కోసం అందమైన దుస్తులను పంపించిన అలియా.. త్వరలోనే తారక్‌ కోసం స్పెషల్‌ ఔట్‌ఫిట్‌ సిద్ధం చేస్తానని తెలిపింది. 
 
అలియా రెండేళ్ల క్రితం దుస్తులకు సంబంధించిన బిజినెస్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఎన్టీఆర్‌ కుమారులు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిన డ్రెస్‌లను పంపింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. 
 
'నువ్వు పంపిన ఈ డ్రెస్‌లు పిల్లలకు చాలా నచ్చాయి. వాళ్ల మొహంలో చిరునవ్వులు చూశాను' అంటూ అలియాకు థ్యాంక్స్‌ చెప్పిన తారక్‌.. త్వరలోనే తన పేరు మీద కూడా ఇలాంటి గిఫ్ట్‌ ఒకటి పంపాలంటూ అలియాను ట్యాగ్‌ చేశాడు. దీనిపై అలియా స్పందిస్తూ.. 'నీ కోసం ఈద్‌ స్పెషల్‌ అవుట్‌ఫిట్‌ను సిద్ధం చేస్తాను' అంటూ ఎన్టీఆర్‌ను స్వీటెస్ట్‌ అని పేర్కొంది.
 
అలాగే 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా అలియా తన ఇన్‌స్టాలో ప్రత్యేక ఇమేజ్‌ను షేర్‌ చేసింది. సినిమాల విషయానికొస్తే అలియా ప్రస్తుతం 'రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' చిత్రంలో నటిస్తోంది. ఇక ఎన్టీఆర్‌ తన30వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఆయన సరసన జాన్వీ కపూర్‌ నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments