జక్కన్నతో అలియా భట్... త్వరలో 'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌కు...(video)

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (13:30 IST)
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని బాలీవుడ్ నటి అలియా భట్ కలుసుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లు హీరోలుగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇందులో ఒక హీరోయిన్‌గా అలియా భట్ నటిస్తోంది. అయితే, కరోనా మహమ్మారితో పాటు ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా ఈ చిత్రం షూటింగులో పాల్గొనలేకపోయింది.
 
ఈ క్రమంలో కరోనా లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇటీవలే నైట్ షూట్ పూర్తి చేసిన చిత్ర బృందం నేటి నుండి మ‌హాబ‌లేశ్వ‌రంలో షూటింగ్ జ‌రుపుకోనుంది. చిత్రంలో సీత పాత్ర పోషిస్తున్న అలియా భ‌ట్ టీంతో క‌లిసింది. రాంచ‌ర‌ణ్‌, అలియాపై జ‌క్క‌న్న కీలక స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.
 
హిందీ చిత్రసీమలో ప్రతిభావంతురాలైన కథానాయికల్లో ఒకరిగా అలియాభట్‌ గుర్తింపు తెచ్చుకుంది. ఏ పాత్రలోనైనా సహజమైన అభినయాన్ని కనబరుస్తుందనే పేరు తెచ్చుకుంది. 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలో ఆమె రాంచరణ్‌ సరసన సీత పాత్రలో నటించబోతున్నది.
 
తొలుత ఆమెపై ఓ పాటను చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చుతుండగా, డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments