నవంబర్ 3న శంకర్ '2.0' ట్రైలర్ రిలీజ్

Webdunia
ఆదివారం, 28 అక్టోబరు 2018 (12:01 IST)
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ - రజినీకాంత్ - అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 2.0. ఈ చిత్రం వచ్చే నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం కోసం సినీ ప్రేమికులంద‌రూ ఎన్నాళ్ళ‌నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 
అది మ‌రేదో కాదు శంక‌ర్ విజువ‌ల్ వండ‌ర్ '2.0. సూపర్‌స్టార్' రజినీకాంత్‌ హీరో భారీ బడ్జెట్‌ చిత్రంతో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. అమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రం 3డీ, 2డీ ఫార్మాట్స్ లో విడుద‌లకానుంది. 
 
అయితే, ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలకాగా, దీనికి భారీ స్పంద‌న ల‌భించింది. ఇక ట్రైల‌ర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఉత్సుక‌త‌తో ఎదురు చూస్తుండ‌గా, దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌రు 3వ తేదీన చిత్ర‌ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. 
 
చెన్నైలోని స‌త్యం సినిమాస్‌లో ఈవెంట్‌ని నిర్వ‌హించి అక్క‌డ చిత్ర ట్రైల‌ర్‌ని 4డీ సౌండ్‌ టెక్నాలజీతో విడుదల చేయనున్నట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇంతవ‌ర‌కు ఆ టెక్నాల‌జీతో ఏ ఇండియ‌న్ సినిమా విడుద‌ల కాలేదు. మ‌నం విన్న వార్త నిజ‌మైతే ఆ రికార్డ్ సాధించిన తొలి భారతీయ చిత్రం '2.0' అవుతుంది. 
 
సుమారుగా రూ.450కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందింది. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. గతేడాది చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ '2.0' వీఎఫ్‌ఎక్స్‌ పనుల ఆలస్యంగా కారణంగా దాదాపు ఏడాది పాటు వాయిదా పడుతూ వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments