Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఫైవ్ డేస్ టెస్ట్ మ్యాచ్'... అక్షయ్ కుమార్ శానిటరీ 'ప్యాడ్‌ మాన్' పట్టించాడు కానీ...

అక్షయ్ కుమార్ హీరోగా తన భార్య ట్వింకిల్ ఖన్నా నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం ప్యాడ్ మాన్. ఈ చిత్రం శుక్రవారం నాడు విడుదలైంది. కానీ తేడా కొట్టేసిందంటూ విశ్లేషకులు తమ రివ్యూలలో దంచేస్తున్నారు. మహిళల సమస్య అయిన ఆ ఐదు రోజుల గురించి అక్షయ్ కుమార్ తీసిన

Webdunia
శనివారం, 10 ఫిబ్రవరి 2018 (18:32 IST)
అక్షయ్ కుమార్ హీరోగా తన భార్య ట్వింకిల్ ఖన్నా నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం ప్యాడ్ మాన్. ఈ చిత్రం శుక్రవారం నాడు విడుదలైంది. కానీ తేడా కొట్టేసిందంటూ విశ్లేషకులు తమ రివ్యూలలో దంచేస్తున్నారు. మహిళల సమస్య అయిన ఆ ఐదు రోజుల గురించి అక్షయ్ కుమార్ తీసిన చిత్రమే ప్యాడ్ మాన్. అక్కడక్కడ మహిళలను ఇబ్బందిపెట్టే సంభాషణలు ఈ చిత్రంలో వున్నట్లు చెపుతున్నారు. 
 
ముఖ్యంగా కొందరు యువకులు మహిళల బహిష్టు కాలాన్ని ఫైవ్ డే టెస్ట్ మ్యాచ్ అంటూ కామెంట్లు చేయడం... తదితర సంభాషణలు ఎబ్బెట్టుగా వున్నట్లు విశ్లేషణల్లో తెలుపుతున్నారు. మొత్తమ్మీద ఈ చిత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోకపోగా విమర్శలను మూటగట్టుకుంటోంది. 
 
ఈ చిత్రం కోసం ఐస్‌ బకెట్‌ చాలెంజ్, రైస్‌ బకెట్‌ చాలెంజ్‌ ప్యాడ్ మాన్ ఛాలెంజ్ అంటూ ప్రమోషన్ చేయించారు. అమీర్ ఖాన్ శానిటరీ ప్యాడ్ పట్టుకుని మీరు చాలెంజ్ చేయండంటూ బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్, షారుక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌లకు సవాల్ విసిరాడు. ప్యాడ్ మాన్ అనేది శానిటరీ ప్యాడ్ సృష్టిక‌ర్త అరుణాచలమ్‌ మురుగనాథమ్ జీవిత క‌థ ఆదారంగా తెర‌కెక్కిన చిత్రం. అక్ష‌య్ కుమార్, రాధికా ఆప్టే, సోనమ్‌ కపూర్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఫిబ్ర‌వరి 9న రిలీజ్ అయింది. ఆర్ బాల్కీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 
 
ప్యాడ్ మాన్ చిత్ర నిర్మాత‌, అక్ష‌య్ కుమార్ భార్య ట్వింకిల్ ఖ‌న్నా తనదైన శైలిలో ప్రమోషన్ చేయించినప్పటికీ ప్యాడ్ మాన్ మంచి చిత్రమే అయినప్పటికీ ఎక్కడో తేడా వుందనే కామెంట్లు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments