Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నిర్మాతకు అండగా నిలిచిన అక్షయ్ కుమార్.. రూ.17 లక్షల ఆర్థిక సాయం

ఆపదల సమయంలో ఆపన్న హస్తం అందించేందుకు ఎప్పుడూ ముందుండే ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఇప్పటికే ఎందరికో, ఎన్నోసార్లు సాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్న అక్షయ్ కుమార్... ఇటీవలే ఉరీ ఉగ్రదాడిలో అమరు

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (13:43 IST)
ఆపదల సమయంలో ఆపన్న హస్తం అందించేందుకు ఎప్పుడూ ముందుండే ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఇప్పటికే ఎందరికో, ఎన్నోసార్లు సాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్న అక్షయ్ కుమార్... ఇటీవలే ఉరీ ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేశాడు. గతంలో కూడా చెన్నై వరద బాధితులకు కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చి ఆదుకున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నిర్మాత రవి శ్రీవాస్తవకు రూ.17 లక్షలిచ్చి అండగా ఉన్నారు. 
 
వివరాల్లోకి వెళ్తే, గత కొంతకాలంగా శ్రీవాస్తవ మూత్రపిండాల సమస్యతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు వెంటనే ఆపరేషన్ చేయాలని, దానికి రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు వెల్లడించారు. అయితే వైద్యం చేసుకోవడానికి అంత స్తోమత లేని శ్రీవాస్తవ... దేవుడి మీదే భారం వేసి ఆపరేషన్‌ని వాయిదా వేశారు. చివరకు సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకున్న అక్షయ్ కుమార్ వెంటనే రూ.17 లక్షలను ఆయనకు పంపించాడు. ఇంకా ఏవైనా ఖర్చులు ఉంటే మొహమాటం లేకుండా అడగమని భరోసా ఇచ్చాడు. అక్షయ్ చేసిన సహాయానికి కన్నీటితో కృతజ్ఞతలు చెప్పారు శ్రీవాస్తవ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments