Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమంత, ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (11:55 IST)
'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి కుర్రకారుని తన మాయలో పడేసింది సమంత. ఆ సినిమా నుండి అనేక విజయాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత హీరో నాగ చైతన్యనే పెళ్లి చేసుకుంది సమంత. పెళ్లి తరువాత ఆమె సినీ ప్రపంచానికి దూరం అవుతారు అని కొందరు అనుకున్నారు. ఐతే సమంత ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ లేడి ఓరియంట్ చిత్రాలు చేస్తూ ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా ఉన్నారు. 
 
సమంత అక్కినేని ఇటీవల చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కలెక్షన్లను రాబడుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’, రీసెంట్‌గా వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. సమంత ప్రస్తుతం '96' రీమేక్‌లో నటించనున్నారు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న సినిమా, విజయ్ సేతుపతి పాత్రలో శర్వానంద్‌, త్రిష పాత్రలో సమంత ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
 
ఒకవైపు బిజీ హిరోయిన్ల్‌‌‌లో ఒకరుగా ఉన్న సమంత ప్రస్తుంత ఆమె వెబ్ సీరీస్‌‌‌పై దృష్టి పెడుతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సీరీస్‌‌‌లో సమంత నెగటివ్ రోల్‌‌‌తో కొనసాగే పాత్ర పోషిస్తుందట. ఇందులో ఫైట్స్ కూడా చేస్తుందని, అందుకోసం ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తోందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments