Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నమో వెంకటేశాయ''లో అక్కినేని నాగేశ్వరరావు.. 3 నిమిషాల పాటు కనిపిస్తారట

అక్కినేని నాగేశ్వరరావు అభిమానులకు ఓ శుభవార్త. మరణించిన ఆయన మళ్ళీ తెరపై కనిపించబోతున్నాడు. అదీ తన నట వారసుడు నాగార్జున సినిమాలో. నిజమా అని షాకవుతున్నారు కదూ.. అయితే ఈ స్టోరీ చదవండి. ప్రస్తుతం టెక్నాలజీ

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (10:00 IST)
అక్కినేని నాగేశ్వరరావు అభిమానులకు ఓ శుభవార్త. మరణించిన ఆయన మళ్ళీ తెరపై కనిపించబోతున్నాడు. అదీ తన నట వారసుడు నాగార్జున సినిమాలో. నిజమా అని షాకవుతున్నారు కదూ.. అయితే ఈ స్టోరీ చదవండి. ప్రస్తుతం టెక్నాలజీ ఏ రేంజ్‌లో అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యానిమేషన్‌ సాయంతో ఎలాంటి కష్టమైన విషయాన్ని ఈజీగా చేసేయవచ్చు. ఈ టెక్నాలజీతో అక్కినేని నాగేశ్వర రావును మళ్లీ తెరపై కనిపించేలా ప్లాన్ చేస్తున్నారు. 
 
నాగార్జున-రాఘవేంద్రరావు దర్శకత్వంలో ''ఓం నమో వేంకటేశాయ'' చిత్రం తెరకెక్కిన సంగతి తెల్సిందే. ఈ సినిమాలో ఒక పాత్రలో నాగేశ్వర రావు 3 నిమిషాల పాటు కనిపించేలా చేస్తున్నారట. అందుకు సంబంధించిన గ్రీన్ మ్యాట్ వర్క్ కూడా ఇటీవలే పూర్తి జరిగిందని సమాచారం. గతంలో నాగేశ్వర రావు - నాగార్జున కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీ రామదాసు’లో నాగేశ్వరరావు ‘కబీర్’ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
 
మొత్తానికి నాగార్జున నటించనున్నఈ ఓం నమో వేంకటేశాయ చిత్రం అందరి ప్రేక్షకులను అలరిస్తుందని ప్రేక్షకులు అంటున్నారు. అనుష్క‌, ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో కీల‌క పాత్రలను పోషిస్తున్నారు. గతంలో నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన భక్తి చిత్రాలు అనూహ్యమైన విజయాలు సాధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ సినిమా కూడా ఆ జాబితాలో చేరనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే నాగార్జున మరోవైపు ఈ భక్తి చిత్రం పూర్తయిన వెంటనే మరో కమర్షియల్ చిత్రంని స్టార్ట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అరెస్టు కోసం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నా? : పేర్ని నాని

Vallabhaneni Vamsi: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు (video)

ఎయిరిండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు!!

కొరియర్ డెలివరీ అంటూ.. పెన్ను అడిగి తలుపు గడియ పెట్టాడు-మత్తుమందిచ్చి రేప్.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments