Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది విన్న‌ప్ప‌టి నుంచి నిద్ర కూడా ప‌ట్ట‌లేదు.. అక్కినేని నాగార్జున

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న చిత్రం `నరుడా..! డోన‌రుడా..!`. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌‌పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మ‌ల్లిక

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (17:11 IST)
హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న చిత్రం `నరుడా..! డోన‌రుడా..!`. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌‌పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ‌, సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లు విడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఆడియో సీడీల‌ను అక్కినేని నాగార్జున విడుద‌ల చేయగా తొలి సీడీని అక్కినేని అఖిల్ అందుకున్నారు. 
 
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ``హిందీలో విడుదలైన విక్కీ డోనార్‌ని ఆధారంగా చేసుకుని తీస్తున్నారు. సుమంత్ చాలా రోజుల త‌ర్వాత మంచి స్క్రిప్ట్‌తో వ‌స్తున్నాడు. చ‌క్క‌టి కామెడీ రోల్‌ని చేశాడు. బావుంటుంద‌ని న‌మ్మి చేశాడు. ఈ సినిమాలో మెసేజ్ ఉంది. ఎంట‌ర్‌టైన‌ర్ ఉంది. హిందీలో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. వీర్య దానం అనే కాన్సెప్ట్‌పై సినిమాను తెర‌కెక్కించారు. 
 
పిల్లలు పుట్టే సమయంలో భార్య భర్తలు మధ్య భ‌యాలు, కాంప్లెక్స్‌లు వంటి వాటికి సంబంధించిన సినిమా. ఇప్పటి రోజుల్లో మెసేజ్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌లిసి ఉన్న సినిమాలు రావ‌డం క‌ష్టమైపోయాయి. కానీ ఈ సినిమాకు కుదిరాయి. కొత్త‌గా ఉన్న‌ప్పుడు ఏ క‌థ‌నైనా నేను కాద‌న‌ను. ఇలాంటి క‌థ నాకు వ‌చ్చినా చేసేవాడిని. ఇప్పుడు న‌మో వేంక‌టేశా చేస్తున్నా. ఆ త‌ర్వాత కూడా న్యూ జాన‌ర్‌లో ట్రై చేద్దామ‌ని ఓ క‌థ విన్నా. అది విన్న‌ప్ప‌టి నుంచి నిద్ర కూడా ప‌ట్ట‌లేదు. అంత బావుంది`` అని అన్నారు. 
 
ఆ తర్వాత హీరో అఖిల్ మాట్లాడుతూ.. `చాలా డిఫరెంట్ మూవీ తెలుగులో ఇలాంటి సినిమా చేయాలంటే గ‌ట్స్ కావాలి. ఇలాంటి క‌థ‌తో సినిమా చేయాల‌ని నాకూ ఉన్నా నేను చేయ‌లేను. సుమంత్ చాలా మంచి స‌బ్జెక్టుతో ముందుకొస్తున్నాడు. హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను`` అని చెప్పారు. 
 
హీరో సుమంత్ మాట్లాడుతూ... ``గోల్కొండ హైస్కూల్ సినిమా చేసేట‌ప్పుడు రామ్మోహ‌న్ నాకు ఈ సినిమా గురించి చెప్పారు. చేయ‌మ‌ని ఐడియా ఇచ్చారు. ఆయ‌న వ‌ల్లే ఈ క‌థ‌ను ఎంపిక చేసుకుని చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నాను. ఈ సినిమాలో కామెడీ ఉంది. యువ‌త‌ సహా అందరికీ సినిమా న‌చ్చేలా ఉంటుంది. ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. మంచి సినిమాతో మ‌ర‌లా వ‌స్తున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాణ విలువ‌లు బావుంటాయి. న‌వంబ‌ర్ 4న సినిమాను విడుద‌ల చేస్తున్నాం`` అని అన్నారు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments