Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున - నాని మ‌ల్టీస్టార‌ర్ రెగ్యుల‌ర్ షూటింగ్‌కి ముహుర్తం ఫిక్స్

కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ భారీ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పైన అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యుల

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (14:04 IST)
కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ భారీ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పైన అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మార్చి 18న ఉగాది రోజున ప్రారంభించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా అగ్ర నిర్మాత అశ్వ‌నీద‌త్ మాట్లాడుతూ... మా వైజ‌యంతి బ్యాన‌ర్లో మ‌ణిశ‌ర్మ చేసిన సినిమాల‌న్నీ మ్యూజిక‌ల్‌గా పెద్ద హిట్ అయ్యాయి. 
 
ఈ సినిమాని కూడా మ్యూజిక‌ల్‌గా బిగ్గెస్ట్ హిట్ చేయ్యాల‌ని ఫుల్‌గా కాన్స‌న్‌ట్రేట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం అమెరికాలో ఈ సినిమాలోని సాంగ్స్‌ని మ‌ణిశ‌ర్మ కంపోజ్ చేస్తున్నారు. మూడు పాట‌ల‌కు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ అక్క‌డ జ‌రుగుతున్నాయి. మార్చి 18 ఉగాది రోజు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మా బ్యాన‌ర్‌లో ఎన్నో మ‌ల్టీస్టార‌ర్స్ చేశాం. అవ‌న్నీ క‌మ‌ర్షియ‌ల్‌గా ఘ‌న విజ‌యాల్ని అందుకున్నాయి. 
 
ఇప్పుడు నాగార్జున‌, నాని కాంబినేష‌న్లో చేస్తోన్న మ‌ల్టీస్టార‌ర్ కూడా బిగ్గెస్ట్ హిట్ అయి మా బ్యాన‌ర్‌కి మ‌రింత పేరు తెస్తుంది అన్నారు. డైరెక్ట‌ర్ టి.శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ... ఎంట‌ర్టైనింగ్ వేలో సాగే డిఫరెంట్ స‌బ్జెక్ట్ ఇది. నాగార్జున, నానిల‌తో వైజ‌యంతి బ్యాన‌ర్లో ఈ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం - మ‌ణిశ‌ర్మ‌, స్ర్కిప్ట్ అడ్వైజ‌ర్ - స‌త్యానంద్, సినిమాటోగ్ర‌ఫీ - శ్యామ్ ద‌త్, ఎడిటింగ్ - ప్ర‌వీణ్ పూడి, మాట‌లు - వెంక‌ట్ డి, ప‌ట్టి శ్రీరామ్, ఆర్. ఇర‌గం, కో-డైరెక్ట‌ర్ - తేజ కాకుమాను, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ - మోహ‌న్, నిర్మాత - అశ్వ‌నీద‌త్, క‌థ‌, స్ర్కీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం - టి.శ్రీరామ్ ఆదిత్య‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments