Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏజెంట్ కోసం అక్కినేని అఖిల్ సిక్స్ ప్యాక్ - నాలుగు రోజుల్లో టీజ‌ర్

Webdunia
సోమవారం, 11 జులై 2022 (10:18 IST)
Akkineni Akhil
ప్రామిసింగ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాతో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నాడు. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ఏజెంట్ టీజర్ జులై 15న విడుదల కానుంది. "ఈ తేదీ తర్వాత పాన్ ఇండియా అంతాట ఎ.. జెంట్ కోసం ఎదురుచూస్తారు. జూలై 15న ఒక వైల్డ్ స్టైల్ వ్యాపించబోతుంది" అని మేకర్స్ ప్రత్యేక వీడియో ద్వారా టీజర్ డేట్ ని ప్రకటించారు.
 
హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు. స్టయిలిష్‌గా చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్సులు 'ఏజెంట్'కి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి.
 
ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు.
 
ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలు.
 
తారాగణం: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా
కథ: వక్కంతం వంశీ
సంగీతం: హిప్ హాప్ తమిజా
డీవోపీ : రసూల్ ఎల్లోర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments