Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాడీపై అకీరా ప్రత్యేక వీడియో.. సోషల్ మీడియాలో వైరల్!

వరుణ్
గురువారం, 6 జూన్ 2024 (12:55 IST)
తన తండ్రి పవన్ కల్యాణ్‌పై ఆయన కుమారుడు అకీరా నందన్ చేసిన ప్రత్యేక వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముగిసిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ సారథ్యంలోని జనసేన పార్టీ అఖండ విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే. దీంతో మెగా ఫ్యామిలీ అంతా సంతోషంలో మునిగితేలుతుంది. ఈ నేపథ్యంలో పవన్‌ కుమారుడు అకీరా ఎడిట్‌ చేసిన వీడియోను పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ పంచుకోగా వైరల్‌గా మారింది. నెటిజన్లంతా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 
 
'కొన్ని వారాల క్రితం వాళ్ల నాన్న కోసం అకీరా నందన్‌ చేసిన ప్రత్యేక వీడియో ఇది. పవన్‌పై తనకున్న ప్రేమకు ఇది నిదర్శనం. తన తండ్రి విజయంపై అకీరా ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నాడు' అని రేణు దేశాయ్‌ దీనికి క్యాప్షన్‌ పెట్టారు. 'ఖుషి' నుంచి 'భీమ్లానాయక్‌' వరకు పవన్‌ చేసిన సినిమాల్లోని పవర్‌ఫుల్‌ డైలాగులతో దీన్ని ఎడిట్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతుండగా 'గూస్‌బంప్స్‌ వస్తున్నాయంటూ' నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు. 'ఎమ్మెల్యే గారి అబ్బాయి చేసిన వీడియో బాగుంది' అని ఒకరు కామెంట్‌ చేయగా.. 'ఇప్పటి వరకు చూసిన వాటిల్లో ఇదే బెస్ట్‌ వీడియో' అని మరో అభిమాని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

కెనడా రాజకీయాల్లో సంచలనం - ఉప ప్రధాని క్రిస్టియా రాజీనామా

పురిటి నొప్పులు వచ్చినా గ్రూప్-2 పరీక్షలు రాసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన భలే అల్లుడు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments