అక్కినేని నాగార్జున అఖిల్ చేతిని విదిలించడం బాధేసింది.. ఎవరు..?

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (20:18 IST)
Bigg Boss Telugu 4
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది. అలాగే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన టాప్-5 కంటెస్టెంట్లు, కంటెస్టెంట్ల పేరెంట్స్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిగ్ బాస్ షో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4లో విన్నర్‌ను ప్రకటించే సమయంలో హోస్ట్ నాగార్జున అఖిల్ చేతిని ఒక్కసారిగా విదిలించారు. నాగార్జున అలా చేయడంతో అఖిల్ ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు. 
 
నాగార్జున అలా చేయడం గురించి అఖిల్ తల్లి సరోజా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షోలో పాల్గొనాలని అఖిల్ కోరుకున్నాడని సీజన్-4లో అఖిల్ రన్నర్ అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో రెండో పొజిషన్ వరకు ఉంటాడని అఖిల్ తనకు చెప్పాడని ఆ మాటను నిలబెట్టుకున్నాడని ఆమె అన్నారు. 
 
బిగ్ బాస్ రన్నర్ అయినా ప్రేక్షకుల్లో ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడంతో పాటు అభిమానుల హృదయాలను అఖిల్ గెలుచుకున్నాడని ఆమె చెప్పారు. అయితే బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌ను ప్రకటించే సమయంలో నాగార్జున ఒక్కసారిగా చేతిని విదిలించడం తనకు బాధ కలిగించిందన్నారు. సోహెల్ గేమ్‌ను గేమ్‌లా చూశాడని అతను 25 లక్షల రూపాయలు తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంలో తనకు తప్పేం అనిపించలేదని ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments