అఖిల్ అక్కినేని ఏజెంట్ ప్రపంచవ్యాప్తంగా విడుదల తేదీ ఖరారు

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (17:30 IST)
Akhil Akkineni
హీరో అఖిల్ అక్కినేని,  సురేందర్ రెడ్డిల మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్  ‘ఏజెంట్ ‘ ఫస్ట్ లుక్ , టీజర్ , పాటల, గ్లింప్స్ తో అంచనాలు భారీగా నెలకొల్పింది . ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఈరోజు అనౌన్స్ చేశారు. అఖిల్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా అల్ట్రా స్టైలిష్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.
 
రిలీజ్ ప్రమోషన్స్ ని కిక్‌స్టార్ట్ చేసిన రిలీజ్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. రాబోయే రోజుల్లో చాలా ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లు రాబోతున్నాయి.
 
‘ఏజెంట్‌’తో సమ్మర్ రేస్‌లో లోకి వచ్చారు అఖిల్. లాంగ్ హాలిడేస్ సినిమాకు చాలా అడ్వాంటేజ్ కానున్నాయి. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో భారీ  పేలుడు జరుగుతున్నప్పుడు, మెషిన్ గన్ పట్టుకుని ఫెరోషియస్ గా నడుచుకుంటూ వస్తూ అఖిల్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించాడు. ఏజెంట్  స్పై హై యాక్షన్ ఎంటర్‌టైనర్.  
 
సురేందర్ రెడ్డి మునుపెన్నడూ చూడని అవతార్, క్యారెక్టర్‌లో అఖిల్‌ని ప్రెజెంట్ చేస్తున్నారు. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు.
 
ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌,  అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.
 
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర,  దీపా రెడ్డి సహ నిర్మాతలు.
 
తారాగణం: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
సహ నిర్మాతలు: అజయ్ సుంకర,  దీపా రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా
కథ: వక్కంతం వంశీ
సంగీతం: హిప్ హాప్ తమిళా
డీవోపీ: రసూల్ ఎల్లోర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments