Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ "అక్కినేని" వంశాభిమానుల ఆశ నెరవేర్చేనా?

అఖిల్ "హ‌లో" మూవీ త‌ర్వాత చాలామంది ద‌ర్శ‌కులు చెప్పిన క‌థ‌లు విని.. ఫైన‌ల్‌గా 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ భారీ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మి

Webdunia
బుధవారం, 9 మే 2018 (09:43 IST)
అఖిల్ "హ‌లో" మూవీ త‌ర్వాత చాలామంది ద‌ర్శ‌కులు చెప్పిన క‌థ‌లు విని.. ఫైన‌ల్‌గా 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ భారీ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల అన్న‌పూర్ణ స్టూడియ‌లో ప్రారంభించిన ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను జూన్ నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రేమ కథాంశంగా రూపొందనున్న ఈ సినిమాలో అఖిల్‌కి జోడీగా నిధి అగర్వాల్ నటించనున్నట్టు తెలుస్తోంది.
 
కథ ప్రకారం ఈ సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను పాటలను అమెకాలో చిత్రీకరించనున్నారు. మూడు వారాల పాటు అక్కడ ఈ సినిమా షూటింగ్ కొనసాగనుంది. ఇంతకుముందు వెంకీ అట్లూరి చేసిన 'తొలిప్రేమ' సినిమాలోనూ కొన్ని సన్నివేశాలను యూకేలో చిత్రీకరించాడు. ఆ సన్నివేశాలు యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేశాయి. అలాగే ఈ సినిమాలోనూ యూకేలో చేయనున్న సన్నివేశాలు ఆడియన్స్ మనసు దోచుకునేలా వుంటాయని అంటున్నారు.  
 
ఈ మూవీకి ఎస్.ఎస్.త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ పాట‌ల రికార్డింగ్ స్టార్ట్ చేసాడు. మ‌రి.. అఖిల్ రెండు సినిమాల్లో ఒక‌టి అట్ట‌ర్ ఫ్లాప్ కాగా, రెండోది యావ‌రేజ్‌గా నిలిచింది త‌ప్పా.. ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేదు. మ‌రి.. ఈ సినిమా అయినా అక్కినేని వంశాభిమానుల ఆశ నెర‌వేరుస్తుంద‌ని ఆశిద్దాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments