Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకరల క్రేజీ ప్రాజెక్ట్

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (21:29 IST)
యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో బ్లాక్‌బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది.
 
వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంబినేషన్లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పైన రామబ్రహ్మం సుంకర, సరెండర్2 సినిమా బ్యానర్ పైన సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు.
 
తన చిత్రాల్లో హీరోలను అత్యంత స్టైలిష్‌గా ప్రజెంట్ చేసే దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని 5వ చిత్రం లో అఖిల్ ని సరికొత్తగా ఆవిష్కరించనున్నారు. 2020 సంవత్సరాన్ని సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ బ్లాక్‌బస్టర్‌తో ప్రారంభించిన ఎకే ఎంటర్టెన్మెంట్స్ బిగ్ స్కేల్లో నిర్మించనున్న అఖిల్ 5తో తన విజయపరంపరను కొనసాగించనుంది.
 
ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
 
హీరో: అఖిల్ అక్కినేని, 
దర్శకత్వం: సురేందర్ రెడ్డి, 
నిర్మాత: రామబ్రహ్మం సుంకర, 
కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments