Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలో తెలుగు చిత్రాలు - ఒకే రోజున 'అఖండ' - 'శ్యామ్ సింగరాయ్'

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (08:45 IST)
ఈ సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాల సందడి కనిపించలేదు. కరోనా వైరస్ మూడో అల కారణంగా అనేక పెద్ద చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. దీంతో కొన్ని చిన్న సినిమాలు వచ్చినప్పటికీ అవి పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. అయితే, సంక్రాంతికి ముందు వచ్చిన "అఖండ", "పుష్ప", "శ్యామ్ సింగరాయ్" చిత్రాలు మాత్రం ఇప్పటికీ దుమ్ము రేపుతున్నాయి. ఈ క్రమంలో ఈ పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
 
ఇక ఇపుడు బాలకృష్ణ "అఖండ", నేచురల్ స్టార్ నాని నటించిన "శ్యామ్ సింగరాయ్‌"లు కూడా ఓటీటీలీ విడుదలకానున్నాయి. అఖండ చిత్రం ఈ నెల 21వ తేదీ నుంచి హాట్ స్టార్ ప్రైమ్ డిస్నీలో స్ట్రీమింగ్ కానుంది. అఖండగా బాలయ్య బీభత్సానికి ప్రేక్షకులు ఫిదా అయిన విషయం తెల్సిందే. ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్లను క్రాస్ చేశారు. ఇక ఈ చిత్రం ఓటీటీలోనూ రికార్డులు సృష్టించడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది.
Nani - Shyam Singha Roy
 
అలాగే, హీరో నాని, సాయిపల్లవి, కృషిశెట్టి నటించిన శ్యామ్ 'సింగరాయ్' కూడా ఈ నెల 21వ తేదీన నెట్ ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగా కానుంది. ఇది గత యేడాది ఆఖరులో పాన్ ఇండియా మూవీగా వచ్చింది. ఐదు భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!

గతంలో తెలుగు భాషపై దాడి జరిగింది : మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

రాంగ్ ఫోన్ కాల్ వాజేడు ఎస్ఐ హరీశ్ ప్రాణం తీసింది.. : యువతి అరెస్టు

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేయడం ఇష్టంలేక.. చేతి వేళ్లను నరుక్కున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments