Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి రావాలంటూ అజిత్ ఫ్యాన్స్ పోస్టర్లు.. తమినళనాడులో కలకలం

అధికార అన్నాడీఎంకేను అనేక వివిదాలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా శశికళ జైలుకెళ్లిన తర్వాత ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ చేతికి పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే, ఆయన అనుసరిస్తున్న వైఖరి వల్ల పార్టీ కోల

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (11:36 IST)
అధికార అన్నాడీఎంకేను అనేక వివిదాలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా శశికళ జైలుకెళ్లిన తర్వాత ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ చేతికి పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే, ఆయన అనుసరిస్తున్న వైఖరి వల్ల పార్టీ కోలుకోలేని చిక్కుల్లో పడుతుంది. దీంతో అన్నాడీఎంకేలో మరో చీలిక తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో తమిళ హీరో అజిత్ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్‌ చేస్తూ ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు అంటించి కలకలం రేపారు. తమిళ చిత్రసీమలో ‘అల్టిమేట్‌ స్టార్‌’గా గుర్తింపు పొందిన అజిత్... కేవలం సినిమాల్లోనే కాకుండా కారు రేసుల్లో కూడా సత్తా చాటుతూ క్రేజ్‌ పెంచుకున్నారు. ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత అజిత్ రాజకీయ ప్రవేశం గురించి కథనాలు వెలువడిన విషయం తెల్సిందే. 
 
ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా అజిత్ అభిమానులు కూడా తమ హీరో రాజకీయాల్లోకి రావాలంటూ నినాదం లేవనెత్తారు. వచ్చే మే 1వ తేదీన 46వ జన్మదినాన్ని జరుపుకోబోతున్న అజిత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ డిజైన చేసిన పోస్టర్లు, బ్యానర్లను ఆదివారం విడుదల చేశారు. మదురైకి చెందిన అభిమానులు అజిత్‌ను రాజకీయాలలోకి ఆహ్వానిస్తూ అంటించిన పోస్టర్లు అంటించడం చర్చనీయాంశంగా మారింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీ యూనివర్సిటీ మెస్‌.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్

చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?

Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments