Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ కీలక షెడ్యూల్ పూర్తి

డీవీ
శనివారం, 10 ఆగస్టు 2024 (09:10 IST)
ajit kumar
స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అజిత్ కుమార్‌ని మూడు డిఫరెంట్ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. 
 
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ కీలకమైన షెడ్యూల్ లో అజిత్ కుమార్, ఇతర నటీనటులపై క్రూషియల్ సీన్స్ షూట్ చేస్తున్నారు. 
 
ఇటీవలి బ్లాక్ బస్టర్ 'మార్క్ ఆంటోని' తో విజయాన్ని అందుకున్న అధిక్ రవిచంద్రన్ ఇప్పుడు స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ గా గుడ్ బ్యాడ్ అగ్లీని తీసుకువస్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన వెర్సటైల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఎక్సయిటింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించనుంది  
 
నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టాప్ టెక్నికల్ టీం పని చేస్తున్న ఇండియన్ సినిమాలో ఒక హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ .ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్‌, జి ఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
 
ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ అభిమానులకు, ఆడియన్స్ కు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించడానికి సిద్ధంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments