మాడ్రిడ్ లో అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఇంపార్టెంట్ షూటింగ్ షెడ్యూల్

డీవీ
గురువారం, 10 అక్టోబరు 2024 (21:05 IST)
Ajith Kumar
స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అజిత్ కుమార్‌ని మూడు డిఫరెంట్ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. 
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మాడ్రిడ్ లో జరుగుతోంది. ఈ కీలకమైన షెడ్యూల్ లో అజిత్ కుమార్, ఇతర నటీనటులపై క్రూషియల్ సీన్స్ షూట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ అజిత్ కుమార్‌ స్టన్నింగ్ లుక్ ని రిలీజ్ చేశారు. వైట్అండ్ వైట్ సూట్ లో ఛార్మింగ్ స్మైల్ లో డైనమిక్ గా నిలుచున్న అజిత్ లుక్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
రీసెంట్ బ్లాక్ బస్టర్ 'మార్క్ ఆంటోని' తో విజయాన్ని అందుకున్న అధిక్ రవిచంద్రన్ ఇప్పుడు స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ గా గుడ్ బ్యాడ్ అగ్లీని  తీసుకువస్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన వెర్సటైల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఎక్సయిటింగ్ సినిమాటిక్  ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది  
 
నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టాప్ టెక్నికల్ టీం పని చేస్తున్న ఇండియన్ సినిమాలో ఒక హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ .ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్‌, జి ఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
 
ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ అభిమానులకు, ఆడియన్స్ కు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించడానికి సిద్ధంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments