Webdunia - Bharat's app for daily news and videos

Install App

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

డీవీ
గురువారం, 15 మే 2025 (19:41 IST)
Karate Kid
బాలీవుడ్ మెగాస్టార్ అజయ్ దేవ్‌గన్ తన కొడుకు యుగ్ దేవ్‌గన్‌తో కలిసి ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌లో సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా నిర్మించిన ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది తొలిసారి తండ్రీ-కొడుకులు కలిసి ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో పని చేయడం కావడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
 
ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్, జాకీ చాన్ పోషించిన మిస్టర్ హాన్ పాత్రకు హిందీలో తన గొంతునిచ్చారు. అదే సమయంలో యుగ్ దేవ్‌గన్ (Ben Wang పాత్ర - లీ ఫాంగ్) పాత్రకు డబ్బింగ్ చెప్పి, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన బాలీవుడ్ ప్రయాణాన్ని ప్రారంభించారు.
 
తండ్రి-కొడుకుల మధ్య ఉన్న సహజమైన అనుబంధం ఈ కథలో mentor-student రిలేషన్‌షిప్‌ను మరింత హృద్యంగా మార్చనుంది. యుగ్‌లో కనిపించే కొత్త తరం ఎనర్జీ, గొంతులో ఉన్న పవర్ ఈ పాత్రకు కొత్త శక్తిని ఇస్తున్నాయి.
 
కరాటే కిడ్: లెజెండ్స్ కథ న్యూయార్క్ నేపథ్యంలో సాగుతుంది. కుంగ్ ఫూ ప్రతిభావంతుడు లీ ఫాంగ్ కొత్త పాఠశాలలో జీవితం ఎలా పోరాటంగా మారుతుందో, మిస్టర్ హాన్, డేనియల్ లారూసో (రాల్ఫ్ మాకియో) మార్గనిర్దేశంలో అతను ఎలా ఎదుగుతాడో ఈ కథ చెబుతుంది. ఈ సినిమా ద్వారా ఓ తరం వారసత్వాన్ని మరో తరానికి అందించడమే కాదు, భారతీయ ప్రేక్షకులకు ‘కరాటే కిడ్’ లెగసీని దగ్గర చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments