Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా గురువుతో నటిస్తున్నా : ఐశ్వర్యారాయ్

Webdunia
శనివారం, 25 మే 2019 (09:54 IST)
మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆచితూచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటోంది. ఈ నేపథ్యంలో తన గురువు, లెజండరీ దర్శకుడు మణిరత్నం తీయబోయే సినిమాలో నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. చెక్క చీవంత వానమ్‌ (తెలుగులో నవాబ్) సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన మణిరత్నం ప్రస్తుతం మరో మల్టీస్టారర్ చిత్రానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాలో ఐశ్వర్య నటిస్తుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఐష్ తాజా ప్రకటనతో వాటికి ఫుల్‌స్టాప్ పడింది.
 
ఈ సందర్భంగా ఐశ్వర్యారాయ్ స్పందిస్తూ ‘‘అవును నా గురువు మణిరత్నం గారి సినిమాలో నటిస్తున్నా. ఇందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాపై ఆయన ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. నా గురువుతో మరోసారి పనిచేసేందుకు చాలా ఉత్సాహంతో ఎదురుచూస్తున్నా’’ అంటూ తెలిపింది. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, అమలా పాల్, సత్యరాజ్ తదితరులు నటిస్తున్నట్లు, ఇందులో ఐశ్యర్యరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments