Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తి మహేష్ రిపోర్ట్... ''అజ్ఞాతవాసి'' చెత్త సినిమా.. చికాకు పెట్టారు...

అజ్ఞాతవాసి ''చెత్త సినిమా'' అనేశాడు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటేనే, ఆయన ఫ్యాన్స్ అంటేనే అంతంతకుపైకి లేచే కత్తి.. జనవరి 10న (నేడు) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అజ్ఞాతవాసి స

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (11:57 IST)
అజ్ఞాతవాసి ''చెత్త సినిమా'' అనేశాడు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటేనే, ఆయన ఫ్యాన్స్ అంటేనే అంతంతకుపైకి లేచే కత్తి.. జనవరి 10న (నేడు) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అజ్ఞాతవాసి సినిమాను థియేటర్లో చూశారు. ఇక సినిమా గురించి ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన 'అజ్ఞాతవాసి' ఓ చెత్త సినిమా అంటూ కత్తి పోస్ట్ చేశాడు. 
 
రివ్యూల పరంగా అజ్ఞాతవాసికి పాజిటివ్ టాకొచ్చిన నేపథ్యంలో.. సినిమా సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.  కానీ కత్తి మహేష్ మాత్రం ఈ సినిమాపై విశ్లేషణ ఇచ్చాడు. సీరియస్‌గా ఉన్న కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టారని కత్తి ట్వీట్ చేశాడు. 
 
సినిమాను అజ్ఞాతవాసి అపహాస్యం చేసిందని విమర్శలు గుప్పించారు. పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా దారుణంగా వుందని.. 'రిస్క్ చేసి చూస్తే... టైమేమో... మీ ఇష్టం' (ఈ సినిమాలో ఓ పాట ఈ ట్యూన్‌లో ఉంది) అంటూ కామెంట్ చేశారు.
 
ఇదిలా ఉంటే.. అజ్ఞాతవాసి సినిమాలో వెంకటేష్ కాసేపు అలా మెరుస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. ఈ సినిమాలో వెంకటేశ్ గెస్ట్ రోల్‌లో ఓ నాలుగు నిమిషాల పాటు కనిపించనున్నాడనే టాక్ వచ్చింది. తీరా అజ్ఞాతవాసి విడుదలయ్యాక చూస్తే వెంకీ సీన్ లేదు. కానీ వెంకీ సీన్‌ను త్వరలో అజ్ఞాతవాసిలో జోడిస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments