Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... అఖిల్ ఏంటి ఇలా మారిపోయాడు...

Webdunia
సోమవారం, 12 జులై 2021 (12:23 IST)
టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని. ఉన్నట్టుండి పూర్తిగా మారిపోయాడు. పూర్తిస్థాయి బాడీబిల్డర్‌గా మారాడు. కండలు భారీగా పెంచేశాడు. ఆ ఫోటో చూస్తే అసలు నిజంగానే ఇతను అఖిలేనా అనే సందేహం ప్రతి ఒక్కరికూ కలగక మానదు. ఈ న్యూలుక్ తన కొత్త సినిమా కోసమట. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తెలుగు దర్శకులలో సురేందర్ రెడ్డికి ఓ ప్రత్యేకత ఉంది. హీరోలను ఆయన ఎంతో స్టైలీష్‌గా చూపిస్తాడు. అప్పటివరకూ సినిమాలు చేస్తూ వచ్చిన హీరోలు, ఆయన సినిమా దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తారు. 
 
అలాగే, ఇపుడు అఖిల్‌ను కూడా సురేందర్ రెడ్డి కొత్తగా చూపించనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సెట్ పైకి వెళ్లడానికి 'ఏజెంట్' కొంతకాలంగా ఎదురుచూస్తున్నాడు. కరోనా ప్రభావం చాలావరకూ తగ్గడంతో, ఈ రోజున ఈ సినిమా టీమ్ రంగంలోకి దిగిపోయింది. ఈ రోజు నుంచి ఇక రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతుంది.
 
సురేందర్ రెడ్డి సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. అలాగే ఈ సినిమాలో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రేంజ్‌లో ఉంటాయని అంటున్నారు. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించాడు. 
 
సురేందర్ రెడ్డి - వక్కంతం వంశీ కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాల్లో చాలావరకూ భారీ విజయాలను అందుకున్నవే. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాతో, కథానాయికగా 'సాక్షి వైద్య' పరిచయం కానుందనే టాక్ వినిపిస్తోంది.


 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments