Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏజెంట్ కథకి పఠాన్ కథతో పోలిక లేదు : డినో మోరియా

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (16:49 IST)
Dino Morea
విచిత్రంగా పఠాన్ కూడా ముగ్గురు ఏజెంట్స్ కి సంబధించిన కథ. వారికంటే ముందే మేము షూటింగ్ స్టార్ట్ చేశాం. మా కథ ముందే తయారైయింది. ఏజెంట్ కథకి ‘పఠాన్’ కథతో పోలిక లేదు. రెండు వేరు వేరు. మా సినిమాలో డిఫరెంట్ ములుపులు వుంటాయి. కథ భిన్నంగా వుంటుంది. ఏజెంట్ గేమ్... డిఫరెంట్ అండ్ టెర్రిఫిక్. అని డినో మోరియా అన్నారు. 
 
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల క్రేజీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధంగా ఉంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలీవుడ్ స్టార్ డినో మోరియా చిత్ర విశేషాలని పంచుకున్నారు. 
 
- ‘ఏజెంట్’ లో నేను ‘రా’ ఏజెంట్ పాత్ర పోషించాను. అయితే వ్యవస్థలో తనకు జరిగిన ద్రోహం కారణంగా వ్యవస్థ కు ఎదురుతిగి, వ్యవస్థపై పగ తీర్చుకునే పాత్ర ఇది. తను ప్రత్యేక శిక్షణ తీసుకున్న పవర్ ఫుల్ ఏజెంట్. కానీ తనకు జరిగిన ద్రోహం కారణంగా ఈవిల్ గా మారిపోతాడు. తనలో చాలా మ్యాడ్ నెస్ వుంటుంది. సురేందర్ రెడ్డి గారు ఈ పాత్రని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. నా పాత్రలో చాలా ఎమోషన్, డ్రామా వుంటుంది. 
 
- ఏజెంట్ కథ విన్నప్పుడు చాలా నచ్చేసింది. తెలుగులోకి రావడానికి ఇదే బెస్ట్ స్క్రిప్ట్ అని  నిర్ణయించుకున్నాను. కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఇది ముగ్గురు ఏజెంట్స్ కథ. ఇందులో నేను విలన్ గా మారడానికి కూడా ఒక కారణం వుంటుంది. కథలో చాలా ప్రాధన్యత వున్న పాత్ర. 
 
- ఇరవై ఏళ్ల క్రితం ‘ప్రియరాలు పిలిచింది’ సినిమాలో మమ్ముట్టి గారితో కలసి పని చేశా. మళ్ళీ ఇన్నాళ్ళుకు ఆయనతో కలసి చేయడం  గొప్ప అనుభూతి.  ఆయన్ని సెట్స్ లో అలా చూస్తూ వుంటాను. ఇందులో ఆయనికి ఎదురుతిరిగే పాత్ర చేశాను. అది పెద్ద సవాల్ గా అనిపించిది. నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఆయన అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. ఆయన్ని మొదటిసారి బుడాపెస్ట్ లో కలిసినప్పుడు దుల్కర్ కంటే యంగ్ గా కనిపించారు. ఇదే విషయం ఆయనకి చెబితే నవ్వేశారు. నా వరకూ.. ఆయన నా టీచర్ నేను ఆయన స్టూడెంట్ ని.  
 
- ఏజెంట్ లో  నా పాత్ర పేరు గాడ్. ఏదైనా చేయగలిగే పవర్ ఫుల్  పాత్ర అది. తను వ్యవస్థపై, ఆ వ్యవస్థని క్రియేట్ చేసిన బాస్ పై రివెంజ్ తీసుకోవాలని చూస్తుంటాడు. 
 
- ఏజెంట్ షూటింగ్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి గారు డెడ్లీ లుక్ కావాలని అడిగారు. నాలుగు లేయర్ల కాస్ట్యూమ్స్ తో అద్భుతంగా కుదిరింది. బుడాపెస్ట్ చలిలో పని చేయడం చాలా సౌకర్యంగా అనిపించింది. తర్వాత కొన్ని యాక్షన్ సీన్లు మస్కట్  ఎడారి లో షూట్ చేశాం. 40 డిగ్రీల వేడి. లెదర్ జాకెట్ , హెవీ మెటిరియాల్ లాంగ్ కోట్  ధరించి షూట్ చేయాల్సి వచ్చింది. లోపల నుంచి చెమట బూట్లు నుంచి బయటికి వచ్చేది. అదొక హారిబుల్ ఫీలింగ్. చాలా క్రేజీ. అయితే ఆ కష్టానికి తగిన ఫలితం దొరుకుతుందనే నమ్మ్మకం వుంది. 
 
- రామ్ చరణ్ నా ఫ్రెండ్. ఆయన ద్వారా అఖిల్ ని ఒకసారి కలిశాను. అప్పటికి ఆయన చాలా యంగ్ లిటిల్ బాయ్ లా కనిపించారు. కానీ ఏజంట్ సెట్ లో అఖిల్ ని చూసి ఆశ్చర్యపోయాను. చాలా అద్భుతంగా కనిపించాడు. చాలా హార్డ్ వర్క్ చేశాడు. తన లుక్ మొత్తం మార్చేశాడు.  తన డెడికేషన్ కి హ్యాట్సాఫ్. 
 
- షూటింగ్ లో ఉన్నప్పుడే నాకు బిగ్గెస్ట్ కాంప్లీమెంట్ మమ్ముట్టి గారి నుంచి వచ్చింది. డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత మమ్ముట్టి గారు నన్ను చూసి.. ‘’ఫెంటాస్టిక్.. చాలా అద్భుతంగా చేశావు’’  అన్నారు. ఆ మాటలని ఎవరైనా రికార్డ్ చేసివుంటే బావుండేదని పించింది. ఇది లైఫ్ టైమ్ మెమరీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments