Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనాలిలో భారీ యాక్షన్ స‌న్నివేశాల్లో ఏజెంట్

Webdunia
బుధవారం, 25 మే 2022 (17:58 IST)
Manali, Agent
అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్. స్టైలిష్ స్పై థ్రిల్లర్‌ గా రూపుదిద్దుకుంటున్న 'ఏజెంట్' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ప్రస్తుతం చిత్ర యూనిట్ మనాలిలో హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని సూపర్వైజ్ చేస్తున్నారు. అఖిల్‌ తో పాటు చిత్రంలోని కీలక నటీనటులు షూటింగ్‌ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన  వర్కింగ్ స్టిల్‌ లో దర్శకుడు సురేందర్ రెడ్డి, డీవోపీ రసూల్ ఎల్లోర్, విజయ్ మాస్టర్‌ సెట్స్ లో కనిపించారు.
 
 హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు.
 
ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్నారు.
 
 అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న విడుదలకు సిద్ధమౌతుంది.
తారాగణం: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు నిర్మాణ నాణ్యతను స్వయంగా పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్! (Video)

అమెరికాలో అనుమానాస్పదస్థితిలో తెలుగు విద్యార్థి మృతి!!

kadapa: కుర్చీ కోసం నిల్చున్న కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఎక్కడ?

6G: టెక్నాలజీ పెరిగిపోతున్నా.. డిజిటల్ డార్కులో వున్న తెలంగాణ స్కూల్స్

Jagan: డిసెంబర్ 24 నుంచి కడప జిల్లాల్లో జగన్ పర్యటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments