Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ నటి శోభనకు ఒమిక్రాన్ పాజిటివ్

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (14:38 IST)
ప్రముఖ సినీ నటి, భరతనాట్య నృత్యకళాకారిని శోభనకు ఒమిక్రాన్ వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. తాను "కీళ్ల నొప్పులు, చలి"తో బాధపడుతున్నట్టు వెల్లడించారు. ఇదే అంశంపై ఆమె ఆదివారం తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, కరోనా రెండు డోసుల టీకాలు వేయించుకున్నప్పటికీ తాను కరోనా ఒమిక్రాన్ బారినపడినట్టు వెల్లడించారు. 
 
"ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు ఒమిక్రాన్ వైరస్ సోకింది. నాకు కీళ్ల నొప్పులు, చలి, గొంతులో దురద, ముక్కుదిబ్బడ వంటి లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు తొలి రోజున బాగా ఉన్నప్పటికీ ఆ తర్వాత రోజు నుంచి కాస్త తగ్గాయి" అని అందులో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, టీకాలు వేసుకోవాలని ఆమె కోరారు.
 
ఇషా చావ్లాకు కరోనా 
తెలుగు అగ్ర హీరో బాలకృష్ణ నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రంలో నటించిన ఇషా చావ్లా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. 
 
కాగా, ఈమె 'ప్రేమ కావాలి' అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత బాలకృష్ణ 'శ్రీమన్నారాయణ' చిత్రంలో నటించారు. అలాగే హీరో సునీల్ నటించిన 'పూలరంగడు', 'మిస్టర్ పెళ్లి కొడుకు', 'జింప్ జిలానీ', 'విరాట్', 'రంభ ఊర్వసి మేనక' వంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు. 
 
ప్రస్తుతం బాలీవుడ్ దర్శకనిర్మాత కబీర్ లాల్ ఆరు భాషల్లో తెరకెక్కిస్తున్న "దివ్య దృష్టి" అనే చిత్రంలో ఆమె ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

ఐస్‌క్రీమ్‌లో జెర్రి... ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన మహిళకు షాక్!

గంగా నదిలో మునిగిన బోటు... ఆరుగురు గల్లంతు!!

రాజీనామా చేసిన జగన్ వీరవిధేయుడు కరికాల వలవన్

ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దు : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సూచన

కీలక అంశాలపై భారత్‌తో కలిసి పని చేస్తాం : కెనడా ప్రధాని ట్రూడో

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments