Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల త‌ర్వాత నాగ చైత‌న్య బిజీ అయ్యాడు!

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (07:58 IST)
Naga chaitanya
ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌కు కాలం క‌లిసివ‌చ్చిన‌ట్లుంగా వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. స‌మంత‌తో విడాకుల త‌ర్వాత ఇద్ద‌రం చాలా హ్యాపీగా వున్నామ‌ని పేర్కొన్నారు.  దీనిపై అక్కినేని ఫ్యాన్స్‌కూడా చైతుకు అండ‌గా నిలిచారు. జీవితంలో వ‌చ్చిన లోటుపాట్లు నిల‌దొక్కుకునేలా తండ్రిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని అక్కినేని ఆల్ ఇండియా ఫ్యాన్స్ అధ్య‌క్షుడు ఇటీవ‌లే ట్విట్ట‌ర్‌లో ఆయ‌న్ను కోరారు. అలా హ్యాపీగా వున్న‌త‌రుణంలో చైతుకు సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చి ప‌డుతున్నాయి. త‌న కొడుకును నిల‌బెట్ట‌డానికి నాగ‌చైత‌న్య చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు. బంగార్రాజుతో సినిమాతో హిట్ కొట్టిన చైతు ఈసారి మ‌రో ఐదు సినిమాల్లో బిజీ అయ్యాడు. ఇప్ప‌టికే బాలీవుడ్‌లో లాల్‌సింగ్ చ‌ద్దా విడుద‌ల‌కు రెడీగా వుంది. 
 
తాజాగా భారీ నిర్మాణ సంస్థ ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు సినిమా ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల చిత్రం చేయ‌నున్నాడు. ఇటీవ‌లే దానిని ప్ర‌క‌టించాడు. అలాగే ఓ వెబ్ సిరీస్‌లో చైతు న‌టిస్తున్నాడని తెలుస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ నిర్మాణ సంస్థ‌తో వెంక‌టేష్, రానా న‌టిస్తున్న ఈ సీరిస్‌లో చైతు ఓ పార్ట్ కానున్నాడ‌ని విశ్వ‌స‌నీయ స‌మ‌చారం. 
 
ఇదిలా వుండ‌గా,  మరో క్రేజీ కాంబినేష‌న్‌లో  చైతు చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ చిత్రంతో విజయాన్ని అందుకున్న రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలో చై నటించనున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారట. ఇక త‌న కాన్‌స‌న్‌ట్రేష‌న్ అంతా సినిమాల‌పైనే అంటూ ఇటీవ‌లే చైత‌న్య కూడా స్టేట్ మెంట్ ఇచ్చాడు. సో.. ఒక‌వైపు విడిపోయిన స‌మంత‌, బిజీ అయితే అంతే ఇదిగా చైతు కూడా బిజీగా వున్నాడన్న‌మాట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సిందూర్ 2.0 జరిగితే ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్‌ను లేపేస్తాం : భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

World Animal Day 2025: ప్రపంచ జంతు దినోత్సవం.. ఈ సంవత్సరం థీమ్‌ ఏంటి.. కొత్త జీవుల సంగతేంటి?

యూట్యూబర్ ముసుగులో శత్రుదేశానికి రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు

Baba Vanga భారతదేశంలో అలాంటివి జరుగుతాయంటున్న బాబా వంగా భవిష్యవాణి 2026

Children: దగ్గు సిరప్ సేవించి 11 మంది చిన్నారులు మృతి.. ఎక్కడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments