వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీసేందుకు సిద్ధమవుతున్నారు. అగ్రహీరోల్లో ఒకరైన నాగార్జునతో వర్మ సినిమా తీయనున్నారు. భారీ బడ్జెట్‌తో సినిమాను చిత్రీకరించేందుకు సిద్ధమవుతున్నారు.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీసేందుకు సిద్ధమవుతున్నారు. అగ్రహీరోల్లో ఒకరైన నాగార్జునతో వర్మ సినిమా తీయనున్నారు. భారీ బడ్జెట్‌తో సినిమాను చిత్రీకరించేందుకు సిద్ధమవుతున్నారు. అన్నపూర్ణ బ్యానర్‌పైనే సినిమా తీసేందుకు నాగ్ ఒప్పుకున్నారు. సినిమాకు సంబంధించి కథను కూడా ఇప్పటికే వర్మ సిద్ధం చేసినట్టు సమాచారం.
సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది. కాలేజ్ స్టూడెంట్‌గా నాగార్జున నటించిన "శివ" ఎంత భారీ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమానే లేదు.
కానీ నాగార్జున ఫిజిక్‌కు తగ్గట్లు ఒక కథను వర్మ సిద్ధం చేసి వినిపించారట. ఆ కథను విన్నదే సినిమా మన బ్యానర్‌లోనే చేద్దామని నాగార్జున చెప్పారట. ప్రస్తుతం సమంత, నాగచైతన్య వివాహ వేడుకల్లో బిజీగా ఉన్న నాగ్ ఇదంతా పూర్తయిన తర్వాత సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.