Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైండ్ దొబ్బింది నిజమే.. జ్యూస్ ఉందా? లేదా? : వర్మ ఏమంటున్నారు?

తనకు మైండ్ దొబ్బిందంటూ పలువురు చేస్తున్న వ్యాఖ్యలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైనశైలిలో స్పందించారు. "గత కొంతకాలంగా రాంగోపాల్ వర్మకు మైండ్ దొబ్బింది, జ్యూస్ అయిపోయింది అంటున్నారు.

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (11:17 IST)
తనకు మైండ్ దొబ్బిందంటూ పలువురు చేస్తున్న వ్యాఖ్యలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైనశైలిలో స్పందించారు. "గత కొంతకాలంగా రాంగోపాల్ వర్మకు మైండ్ దొబ్బింది, జ్యూస్ అయిపోయింది అంటున్నారు. అందులో మైండ్ దొబ్బిందన్న మాట నిజం. కానీ, జ్యూస్ అయిపోయిందా? లేదా? అన్నది ఈ సినిమా తర్వాత తెలుస్తుంది" అన్నారు.
 
అక్కినేని నాగార్జున హీరోగా, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'కంపెనీ' పేరిట ఓ చిత్రం నిర్మితం కానుంది. ఈ చిత్రం ముహూర్తపు షాట్ సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, 'శివ' చిత్రం సమయంలో నాగార్జున తనపై నమ్మకం ఉంచి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో, ఇప్పుడూ అదే విధమైన స్వేచ్ఛను తనకిచ్చారన్నారు. 
 
ఈ కథను తాను నాగ్‌కు చెప్పిన తర్వాత, ఎంతో ఎగ్జయిట్ అయ్యారని, తాను అంతే ఇన్టెన్సిటీతో సినిమాను తీయనున్నట్టు చెప్పారు. తాను నాగార్జునను ఎక్కువగా నమ్ముతానని, కథ విన్న తర్వాత నాగ్ రియాక్షన్ చూసిన తర్వాత ఈ సినిమాపై నాకు ఎంతో నమ్మకం పెరిగిందన్నారు. 
 
కాగా, 27 సంవత్సరాల క్రితం సూపర్ హిట్ అయి, తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన 'శివ' చిత్రం వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన విషయం తెల్సిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం ఇపుడు తెరకెక్కనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments