Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాప్ లో స్ప్రింటర్‌గా ఆదిపినిశెట్టి

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (17:45 IST)
Adi Pinchetti
హీరో ఆది పినిశెట్టి అథ్లెట్‌గా న‌టిస్తోన్న చిత్రం `క్లాప్‌`. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజీ (సర్వంత్ రామ్ క్రియేషన్స్) మరియు M రాజశేఖర్ రెడ్డి (శ్రీ షిర్డీ సాయి మూవీస్) సంయుక్తంగా నిర్మించారు. ఐబి కార్తికేయ‌న్ (బిగ్‌ప్రింట్ పిక్చ‌ర్స్‌) స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
 
ఈ సినిమా టీజర్ సెప్టెంబర్ 6న విడుదలకానుంది. ఈసంద‌ర్భంగా విడుద‌ల‌ చేసిన‌ పోస్టర్‌లో ఆది పినిశెట్టి పెద్ద పోటీ కోసం సన్నాహాలు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆ పోస్ట‌ర్లో ఆది స్ప్రింటర్‌గా కనిపిస్తున్నారు. ఒలింపిక్స్ లో భార‌త‌దేశం మంచి ప్ర‌తిభ‌ను ప్రదర్శిస్తున్ననందున ఈ సినిమా టీజర్ విడుదలకు ఇది సరైన సమయం అని చిత్ర యూనిట్ భావిస్తోంది. క్లాప్ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.
 
ఈ మూవీలోఆది స్ప్రింటర్‌గా క‌నిపించ‌డానికి కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా, ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఆకాంశ సింగ్ కథానాయికగా నటిస్తుండగా, కృష్ణ కురుప్, ప్రకాష్ రాజ్, నాసర్, బ్రహ్మాజీ, మైమ్ గోపి మరియు మునిష్కాంత్ కీల‌క‌పాత్ర‌ల‌లో కనిపిస్తారు.
 
తారాగ‌ణం: ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్, కృష కురుప్, ప్రకాష్ రాజ్, నాసర్, బ్రహ్మాజీ, మైమ్ గోపి మరియు మునిష్కాంత్
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వం: పృథ్వి ఆదిత్య‌, నిర్మాత‌లు: రామాంజనేయులు జవ్వాజీ , M రాజశేఖర్ రెడ్డి, సంగీతం: ఇళ‌య‌రాజా, కెమెరాః ప్ర‌వీణ్ కుమార్‌,  మాట‌లు: వ‌న‌మాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments