Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అద్దంలో దెయ్యం": మొదటి కాపీ సిద్ధం.. హారర్ ఎంటర్‌టైనర్‌గా హిట్టే!

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (17:40 IST)
నాగసత్య పిక్చర్స్ పతాకంపై రమేష్ నూతలపాటి దర్శకత్వంలో సత్యనారాయణ బచ్చు నిర్మిస్తున్న హారర్ ఎంటర్‌టైనర్ "అద్దంలో దెయ్యం". ముత్తంశెట్టి ఫణిభూషణ రావు-డాక్టర్ ఎ .యెస్. రాయుడు సహ నిర్మాతలు. ధనరాజ్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, హేమత్, ఆర్తిపురి, గీతాంజలి, ఆర్.కె. బాబాయ్, లావణ్య, శేషుకుమార్, రచ్చరవి, నర్శింగ్ యాదవ్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, మొదటి కాపీ సిద్దం చేసుకుంది. 
 
కిషన్ కవాడియ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రం ఆడియో మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఇటీవల విడుదలైంది . ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రమేష్ నూతలపాటి మాట్లాడుతూ.. 'కామెడీకి పెద్ద పీటవేస్తూ రూపొందించిన హారర్ ఎంటర్‌టైనర్ "అద్దంలో దెయ్యం". విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ' అన్నారు. 
 
నిర్మాత సత్యనారాయణ బచ్చు మాట్లాడుతూ .. 'మా దర్శకుడు రమేష్ నూతలపాటి 'అద్దంలో దెయ్యం' చిత్రాన్ని ఆద్యంతం అత్యంత ఆసక్తిగా తీర్చిదిద్దారు. కిషన్ కవాడియ అందించిన బాణీలతో పాటు, రీ-రికార్డింగ్ ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలుస్తుంది' అన్నారు .
 
సహ నిర్మాతలు మత్తంశెట్టి ఫణిభూషణ రావు - డాక్టర్ ఎ.ఎస్. రాయుడు "అద్దంలో దెయ్యం" చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి డాన్సులు : రాజేష్, ఫైట్స్ : మార్షల్ రమణ -శేఖర్, పాటలు: సత్యముని, సంగీతం : కిషన్ కవాడియా, సహ నిర్మాతలు: మత్తంశెట్టి ఫణిభూషణ రావు - డాక్టర్ ఎ.ఎస్. రాయుడు, నిర్మాత: సత్యనారాయణ బచ్చు, కథ -స్క్రీన్ ప్లే -దర్సకత్వం: రమేష్ నూతలపాటి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments