Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడవి శేష్ నటిస్తున్న జి 2 అప్ డేట్ గుజరాత్‌లో ప్రారంభం

డీవీ
శనివారం, 30 మార్చి 2024 (11:04 IST)
Banitasandhu
ఇటీవలే తన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి జి 2  సినిమా ప్రమోషన్ లో కొత్త ప్రచారాన్ని నెలకొల్పిన అడవి శేష్ నేడు హీరోయిన్ బనితాసంధు ఫొటో పెట్టి షూటింగ్ ప్రారంభం అంటూ క్లారిటీ ఇచ్చాడు.  కొత్త షెడ్యూల్ గుజరాత్‌లోని భుజ్‌లో ప్రారంభమయింది. అడివిశేష్, బనితాసంధు ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. హీరోయిన్ బనితాసంధు సెల్ఫీని తీసుకుని పోస్ట్ చేసింది. ఈ లొకేషన్ లో గతంలో మగధీర సినిమాలో ఓ సీన్ తీశారు.
 
2018లో ఆడియన్స్ ముందుకు వచ్చి థ్రిల్ చేసిన స్పై యాక్షన్ మూవీ ‘గూఢచారి’. శశి కిరణ్ టిక్క డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అడివి శేష్ ఇవ్వడం విశేషం. అప్పటినుంచి ఈ సినిమాకు ఫ్రాంచైస్ గా ఉంటే బాగుండు అనే భావన చిత్ర టీమ్ కు కలిగింది. దానివల్ల రెండో పార్ట్ వస్తుంది. 
 
గత ఏడాది ఈ సినిమాకు సంబందించి ఓ గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. ఇందులో అడవి శేష్ జేమ్స్ బాండ్ తరహాలో లుక్ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లేదు. ఇప్పటికీ మరలా ఈ సినిమా ఆరంభం అని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ బనితా సంధు హీరోయిన్ గా, ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. ‘మేజర్’ సినిమాకి ఎడిటర్ గా పని చేసిన వినయ్ కుమార్ ఈ  సీక్వెల్ ని డైరెక్ట్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments