Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమాండో-2 రిజల్ట్‌తో తేలిపోనున్న అదా శర్మ ఫ్యూచర్

హీరోయిన్ అనే గుర్తింపు ఉందే తప్ప.. వెనుదిరిగి చూసుకుంటే ఆదా శర్మ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదనే చెప్పాలి. తెలుగులో వచ్చిన హార్ట్ ఎటాక్, క్షణం సినిమాలో ఆమె కెరీర్‌లో గుర్తించదగ్గ సినిమాల

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (06:15 IST)
హీరోయిన్ అనే గుర్తింపు ఉందే తప్ప.. వెనుదిరిగి చూసుకుంటే ఆదా శర్మ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదనే చెప్పాలి. తెలుగులో వచ్చిన హార్ట్ ఎటాక్, క్షణం సినిమాలో ఆమె కెరీర్‌లో గుర్తించదగ్గ సినిమాలు బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలన్న అమ్మడి ఆశలు ఇంకా నెరవేరలేదు. అయితే అసలు ఆదా శర్మ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో కమాండో-2 రిజల్ట్‌తో తేలిపోతుందని సినీజనం భావిస్తున్నారు. 
 
మార్చి 3న రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమాపై ఆదా ఎన్నో ఆశలు పెట్టుకుంది. సినిమాలో యాక్షన్‌తో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ దుమ్మురేపింది అందాల చిన్నది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే తనకు ఇండస్ట్రీలో మరో అవకాశం వస్తుందని భావిస్తోంది. బాలీవుడ్‌లోనే కాదు.. మళ్లీ దక్షణాదిలో తనకు అవకాశాలు రావాలన్నా ఈ సినిమా రిజల్టే కీలకమని ఆదా ఫిక్స్ అయ్యింది. 
 
యాక్షన్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా గతంలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా.. నోట్లరద్దు కారణంగా అప్పట్లో విడుదల వాయిదా పడింది. దీంతో అమ్మడి టెన్షన్‌ కూడా పోస్ట్‌పోన్ అయింది. ఇక ఈసారి ఎలాగైనా సినిమా రిలీజ్ కావడం ఖాయం కావడంతో కమాండో-2 తనకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అని ఆదాశర్మ ఆశగా ఎదురుచూస్తోంది. మొత్తానికి రెండుసార్లు రిలీజ్‌ వాయిదా పడ్డ ఈ సినిమా ఆదా శర్మ ఆశలను బ్రతికిస్తుందా అన్నది త్వరలోనే తేలిపోనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments