Webdunia - Bharat's app for daily news and videos

Install App

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

డీవీ
బుధవారం, 22 మే 2024 (15:25 IST)
Adah Sharma
అదా శర్మ ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా క్రేజీ బ్యూటీగా మారిపోయారు. ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో అదా శర్మ రేంజ్ మారిపోయింది. చాలా కాలం తరువాత అదా శర్మ ప్రస్తుతం తెలుగు వారిని పలకరించేందుకు వస్తున్నారు. అదా శర్మ తెలుగులో నటించి చాలా కాలమే అవుతోంది. అందువల్ల ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ అనే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కృష్ణ అన్నం దర్శకత్వం వహించిన ఈ మూవీని SSCM ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీకి గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
 
అసలే ఇప్పుడు హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లకు ఎక్కవుగా డిమాండ్ ఉంది. కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి.  ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ అనే సినిమా కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెంచేశాయి. 
 
ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. మే 24న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇప్పటికే ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడం, సెన్సార్ నుంచి మంచి రిపోర్ట్‌ రావడంతో మరింత అంచనాలు పెరిగాయి. 
 
ఈ మూవీలో రీసెంట్ సెన్సేషన్ అదా శర్మ కీలక పాత్ర పోషిస్తుండగా.. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏ.ముద్దు కృష్ణ డైలాగ్స్ అందించగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. సత్య గిడుతూరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. RR ధృవన్ సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments