Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూఢ నమ్మకాలను బాగా నమ్ముతా.. పూరీ బాగానే చూపించారు.. కానీ పబ్లిసిటీ చేసుకోలేదు: ఆదాశర్మ

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (13:07 IST)
టాలీవుడ్‌లో మరో ఐరన్‌లెగ్‌గా పేరుగాంచిన భామ ఆదాశర్మ. ఈ ముద్దుగుమ్మ గతంలో పూరీజగన్నాథ్ - నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన 'హార్ట్ ఎటాక్' చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఈమె హీరోయిన్‌గా చేసిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆదాశర్మకు ప్రధాన హీరోయిన్‌గా పాత్రలు లభించడం గగనమైపోయింది. ఫలితంగా పలు చిత్రాల్లో చిన్నచిన్న క్యారెక్టర్లతో పాటు.. ఐటమ్ సాంగ్‌లకే పరిమితమైపోయింది. 
 
తాజాగా, మదన్ దర్శకత్వంలో ఆది హీరోగా సాయికుమార్ నిర్మించిన చిత్రం "గరం". ఈ చిత్రంలో ఆది సరసన ఆదాశర్మ నటించింది. ఈ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు హైరాబాద్‌లో జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... రియల్ లైఫ్.. రీల్ లైఫ్ విషయాలను తాను ఎక్కువగా బహిరంగ పరచనన్నారు. అలా ముందుగా చెపితే ఏదీ కూడా అనుకున్నట్టు జరగడం లేదన్నారు. అందుకే టాలీవుడ్ లేదా బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ.. ఆ చిత్రాల షూటింగ్ 50 శాతం మేరకు పూర్తయితేనే.. ఫలానా చిత్రంలో తాను నటిస్తున్నట్టు బహిరంగపరుస్తానని చెప్పారు. దీనికి కారణం.. తనకు మూఢ నమ్మకం ఎక్కువగా ఉందన్నారు. 
 
ఇలాంటి నమ్మకాలను తాను గుడ్డిగా నమ్మేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే, నా పెళ్లి విషయం కూడా పెద్దలు అన్నీ కుదుర్చుకున్నాక.. వారు చెప్పమని చెపితేనే అధికారికంగా వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది. చిత్ర పరిశ్రమలో తన గురించి పాజిటివ్, నెగెటివ్ టాక్ సాగుతోందనీ, ఇందులో నెగెటివ్ టాక్ గురించి అసలు పట్టించుకోనని చెప్పింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తనకు అవకాశం వచ్చిందనీ, ఆ చిత్రం విడుదలైన తర్వాత తన గురించి పబ్లిసిటీ చేసుకోవడంలో తాను పూర్తిగా విఫలమయ్యాయని చెప్పింది. ఈ చిత్రంలో దర్శకుడు పూరి తనను బాగానే చూపించారనీ, కానీ, దాన్ని అందిపుచ్చుకోలేక పోయినట్టు చెప్పారు. దీనికి కారణం పబ్లిసిటీ లేకపోవడమేనని చెప్పుకొచ్చింది. అయితే, ఓ గొప్ప దర్శకత్వంలో నటించానని అనుభూతి మాత్రం మిగిలిపోయిందని ఆదాశర్మ చెప్పుకొచ్చింది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments