Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిరిజన యువతిగా చాలా కష్టాలు పడ్డాను.. 'మౌనపోరాటం' అలా ఛాన్స్ వచ్చింది.. యమున

ఠాగూర్
గురువారం, 14 మార్చి 2024 (12:18 IST)
గిరిజన యువతిగా చాలా కష్టాలు పడ్డానని హీరోయిన్ యమున అంటున్నారు. అలాగే, "మౌనపోరాటం" చిత్రంలో అవకాశం యాదృచ్ఛికంగానే వచ్చిందన్నారు. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌కు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. 'మౌనపోరాటం' చిత్రంలోని పాత్ర కోసం చాలా మందిని టెస్ట్ చేశారు. కానీ, తనతోనే ఆ పాత్రను చేయించాలని నిర్మాత రామోజీరావుగారు చెప్పారన్నారు. 
 
ఈ సినిమా షూటింగును అరకు సమీపంలోని ఓ అటవీ ప్రాంతంలో చిత్రీకరించారని తెలిపారు. ఈ సినిమాలో తాను గిరిజన యువతిగా నటించినట్టు చెప్పారు. ఇందుకోసం కాళ్లకు చెప్పులు కూడా ఉండవన్నారు. అలా చెప్పులు లేకుండానే ఒక షాట్‌‍లో దర్శకుడు తనను పెరుగెత్తించారన్నారు. అక్కడ విపరీతమైన ముళ్లు, ముళ్ల పొదలు ఉండేవన్నారు. పాదాల్లో ముళ్లు దిగినప్పటికీ ఒళ్లంతా ముగ్గు గీసుకునిపోయి రక్తం వచ్చేదన్నారు. 
 
ఇప్పటికే తనకు ఆ సన్నివేశం గుర్తుకు వస్తూనే ఉంటుందన్నారు. అంతగా ఆ సినిమా కోసం పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించిందన్నారు. ఈ పాత్రను ఈ అమ్మాయి మాత్రమే చేయగలదు అని మంచి పేరు వచ్చిందన్నారు. ఇక ఆ తర్వాత కాలంలో తాను బంగారు కుటుంబం షూటింగులో ఉండగా, వర్మగారు అలా వెళుతూ తనను చూశారని, ఆ మరుసటిరోజే గోవిందా గోవిందా చిత్రంలో లక్ష్మీదేవి పాత్రను ఇచ్చారని, ఆ సంఘటన ఎన్నటికీ మరిచిపోలేనని యమున చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments