Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూ. ఎన్టీఆర్ అలాంటివాడా? కంటతడిపెట్టిన హీరోయిన్... ఏం చేశారో?

టాలీవుడ్ యువ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ హీరో పేరెత్తితే ఓ సీనియర్ హీరోయిన్ కంటతడి పెడుతోంది. ఇలా ఎందుకు కన్నీరు కార్చుతుందో అందరిమనసుల్లో "శంకరాభరణం తులసి"గా స్థానాన్ని పదిల పరుచుకున్న ఆమె తాజాగా ఓ ఇంట

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (14:25 IST)
టాలీవుడ్ యువ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ హీరో పేరెత్తితే ఓ సీనియర్ హీరోయిన్ కంటతడి పెడుతోంది. ఇలా ఎందుకు కన్నీరు కార్చుతుందో  అందరిమనసుల్లో "శంకరాభరణం తులసి"గా స్థానాన్ని పదిల పరుచుకున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 
 
"ఎన్టీఆర్‌ను నేరుగా నేనింత వరకు చూసింది లేదు. కనీసం ఆయనతో నటించలేదు. కానీ, ఎన్టీఆర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. కనీసం పరిచయం కూడా లేని ఆయన.. నేను వస్తున్నానని చెబితే ముఖ్యమైన సీన్‌ను వదిలేసి మరీ నా కోసం వచ్చారు. నన్ను ఆయన రిసీవ్ చేసుకున్నారు. ‘అయ్యో అమ్మా.. మీకెందుకు అమ్మా.. నేను వస్తున్నాను’ అంటూ ఆయన నా దగ్గరకు వచ్చారు. అలా అన్నారు చూడండి అది చాలు. ఆ అబ్బాయిని కలిశాక.. ఆయనేంటో ఇంకా అర్థమైంది. నాకు కళ్లలో నీళ్లు తిరగడం చూసి ఆయన కళ్లు కూడా చెమర్చాయి. 
 
కానీ, ఎన్టీఆర్‌ను కలవడం అదే ఫస్ట్ టైం. అయినా సరే.. అంత తక్కువ సమయంలో షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చి మరీ కలిశారు నన్ను. ఆయన అమ్మా అని నన్ను పిలిచారు. నిజమే నేను ఆయనకు అమ్మ లాంటిదాన్నే. ఎన్టీఆర్ బంగారం. ఈ అబ్బాయి మీరు చూసే అబ్బాయి కాదు. ఎక్కడో ఉండాల్సిన అబ్బాయి" అని ఎన్టీఆర్ గురించి చెబుతూ లైవ్‌లోనే కంటతడి పెట్టారు అలనాటి నటి తులసి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

గాజువాక చిరు వ్యాపారుల సిగపట్టు... అడ్డుకోబోయిన వ్యక్తికి దాడి (video)

ఆర్టీసీ బస్సులో వృద్ధులకు రాయితీ.. మార్గదర్శకాలు ఇవే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments